Sankranti: పతంగుల మాటున ప్రమాదాలు జరిగే అవకాశం..
ABN , Publish Date - Jan 10 , 2025 | 09:07 AM
సంక్రాంతి(Sankranti) అంటే మొదట గుర్తుకు వచ్చేది పతంగులు. ఇప్పటికే మార్కెట్లలో గాలి పటాల దుకాణాలు వెలిశాయి. వీటిలో పతంగులు, మాంజా దారాలు, క్యాండిల్స్, ప్యారాషూట్, ఫ్యాన్సీ ఐటమ్స్, చెరకా మొదలైనవి విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: సంక్రాంతి(Sankranti) అంటే మొదట గుర్తుకు వచ్చేది పతంగులు. ఇప్పటికే మార్కెట్లలో గాలి పటాల దుకాణాలు వెలిశాయి. వీటిలో పతంగులు, మాంజా దారాలు, క్యాండిల్స్, ప్యారాషూట్, ఫ్యాన్సీ ఐటమ్స్, చెరకా మొదలైనవి విక్రయిస్తున్నారు. దీంతో పెద్దలు, పిల్లలు ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో పతంగులు ఎగుర వేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏటా సంక్రాంతి సందర్భంగా ఎగుర వేసే గాలి పటాలు కారణంగా ఎక్కడో ఒక చోట విషాద సంఘటనలు జరుగుతున్నాయి. పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా, తెలిసి తెలియని వయస్సులో చిన్న పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దుబాయి తీసుకెళ్తా.. ఇజ్రాయిల్ పంపిస్తా..
పట్టణాల్లో మైదాన ప్రాంతాల్లో లేకపోవడంతో బహుళ అంతస్తుల భవనం పైకప్పుల నుంచి పతంగులను ఎగురవేస్తారు. పిట్ట గోడలు లేని పైకప్పుల అంచుల వద్ద పతంగులు ఎగుర వేసే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే గాలి పటాలు విద్యుత్ లైన్లపై పడిన సందర్భంలో వాటిని దక్కించుకొనే ప్రయత్నంలో విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశమూ ఉంది. చైనా మాంజాల కారణంగా పక్షులు ప్రాణాపాయం కలిగే పరిస్థితులు నెలకొంటాయి. నైలాన్, సింథటిక్ దారానికి గాజుపొడి, కొన్ని రసాయనాలు కలిపి తయారు చేయడంతో చైనా మాంజాలు(China manga) తెగకుండా దృఢంగా ఉండి, ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పిల్లలు గాలి పటాలు ఎగుర వేస్తుంటే తల్లిదండ్రులు గమనిస్తుండటం మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- భవనాలు, గోడలు, బాల్కానీల పైనుంచి గాలి పటాలను ఎగుర వేయవద్దు.
- పిల్లలు భారీ భవన సముదాయాలు, విద్యుత్ తీగలు, సెల్‌ఫోన్ టవర్ల సమీపంలో గాలి పటాలు ఎగుర వేసే సాహాసం చేయవద్దు.
- పతాంగులు విద్యుత్ తీగలు, చెట్లపై పడితే తీసుకునే ప్రయత్నం చేయవద్దు.
- రోడ్ల వెంట గాలి పటాలు ఎగుర వేయవద్దు. గాలిలో ఎగురుతున్న పతంగిని చూసుకుంటూ వాహనాలను రాకను గమనించకపోతే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.
ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు
ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్’ యాప్
ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?
ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్
Read Latest Telangana News and National News