BJP MLA: చొరబాటుదారులను గుర్తించేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Feb 28 , 2025 | 09:06 AM
తెలంగాణలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవడానికి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh) ఎక్స్ ట్విటర్‌లో డిమాండ్ చేశారు.

- ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ సిటీ: తెలంగాణలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవడానికి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh) ఎక్స్ ట్విటర్‌లో డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మరోసారి బంగ్లాదేశీయులు అక్రమ కార్యకలాపాలు చేస్తూ బుధవారం పట్టుబడ్డారని, నకిలీ హిందూ పేర్లను ఉపయోగించి పశ్చిమ బెంగాల్ ద్వారా హైదరాబాద్‌లోకి రోహింగ్యాలు చొరబడ్డారని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: కిచెన్ వ్యర్థాలతో బయోగ్యాస్..
అలాగే వారు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా(Mumbai, Bangalore, Chennai, Kolkata) వంటి ప్రధాన నగరాల్లో వ్యాపించారని వివరించారు. అక్రమంగా చొరబడిన వీరు సెక్స్ రాకెట్, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా, హైదరాబాద్ పాతబస్తీ(Hyderabad Old City) అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బలమైన కోటగా మారిందని, ఇలాంటి ఘటనలపై పాతబస్తీలోని ముస్లిం నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈవార్తను కూడా చదవండి: ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన టన్నెల్
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
ఈవార్తను కూడా చదవండి: అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా చూడాలి
Read Latest Telangana News and National News