Share News

Special Trains:సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:09 PM

Special Trains: సంక్రాంతి వేళ.. భాగ్యనగరం హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రయాణికులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

Special Trains:సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా.. నిజంగా మీకు పండగలాంటి వార్త
Special trains

హైదరాబాద్, జనవరి 05: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించంది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతోన్నట్లు తెలిపింది.

సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలకు ఈ అదనపు రైళ్లను నడుపుతోన్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతాలకు జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది.

Special-trains.jpg


సంక్రాంతి వేళ.. భాగ్యనగరం హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు ప్రయాణికులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

మరోవైపు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోన్నాయి. హైదరాబాద్‌లోని ఎల్ బీ నగర్ , హయత్ నగర్, అమీర్ పేట్, కోటి తదితర ప్రాంతాల నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోన్నాయి. అలాగే విజయవాడ నుంచి సైతం తెలంగాణలోని పలు ప్రాంతాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. అయితే గతేడాది అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ఆర్టీసీ రీజియన్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2025 | 03:33 PM