KRMB Meeting: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ ఏపీకి ఇవ్వం
ABN , Publish Date - Jan 21 , 2025 | 09:30 PM
KRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్ సమావేశం మంగళవారం జరిగింది.ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల్లోని నీటి పారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నదీ జాలాలపైనే కాకుండా ప్రాజెక్ట్‌లపై వాడి వేడి చర్చ జరిగింది.

హైదరాబాద్, జనవరి 21: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వబోమని తేల్చి చెప్పినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ బాధ్యతల నుంచి సీఆర్పీఎఫ్‌ను విరమించాలని కోరామన్నారు. అలాగే శ్రీశైలం డ్యాం సేఫ్టీ మీద సైతం చర్చించినట్లు ఆయన వివరించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని జలసౌధలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో 3, 4 ప్రధాన అంశాలను ప్రస్తావించినట్లు ఆయన వివరించారు.
అందులోభాగంగా కృష్ణా నదీ జలాల వాటాతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు నీటి మళ్లింపుపై చర్చించామన్నారు. 66:34 వాటాలను అప్పట్లో ఒక్క సంవత్సరం కోసమే ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అయితే 79:21 నిష్పత్తిలో నీటి కేటాయింపులు చేయాలని స్పష్టం చేశారు. 79 శాతం వాటా తెలంగాణ హక్కు అని బల్లగుద్దీ మరి చెప్పారు. అప్పటి వరకు నదీ జలాల వాటాలను 50:50 ఇవ్వాలని కేఆర్‌బీఎమ్‌ను కోరామన్నారు.
ఇక తెలంగాణ నదీ జలాల వాటా పెంచేందుకు చైర్మన్ కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అయితే బేసిన్ బయటకు ఎంత మేర మళ్లిస్తున్నారో కూడా తెలియాల్సి ఉందన్నారు. 11 ప్రాంతాల్లో టెలి మెట్రిక్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో వివరించామన్నారు. నదీ జలాల వాటాలకు సంబంధించి తమ ప్రతిపాదనలపై చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే గత ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగార్జున సాగర్ డ్యాం సీఆర్పిఎఫ్ ఆధీనంలోకి వెళ్లిందని గుర్తు చేశారు.
Also Read: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో ఉన్న నీటి వాటా కేటాయింపు చేయాలని ఈ సమావేశంలో కోరినట్లు చెప్పారు. ఇక తెలంగాణ అధికారులు 50:50 కేటాయింపు జరగాలని కోరారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి స్పాంజ్ పూల్ సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు తెలంగాణ ప్రభుత్వం చూసుకొంటుందని కోరారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. అలాగే KRMB కార్యాలయం ఎక్కడ అనేది ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఈఎన్సీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
Also Read: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
Also Read: సీఎం మమతా బెనర్జీపై వైద్యురాలి తండ్రి సంచలన ఆరోపణలు
For Telangana News And Telugu News