తప్పుడు పత్రాలిస్తే పథకాలు రద్దు
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:35 AM
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని పలువురు రాష్ట్ర మంత్రు లు సూచించారు.

అనర్హులను ఎంపిక చేస్తే అధికారులదే బాధ్యత.. అర్హులనే ఎంపిక చేయాలి: స్పష్టం చేసిన మంత్రులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అర్హులనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని పలువురు రాష్ట్ర మంత్రు లు సూచించారు. ఎక్కడైనా అనర్హులను పథకాలకు ఎంపిక చేస్తే అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తప్పుడు పత్రాలు ఇచ్చి లబ్ధిదారులుగా ఎంపికైన వారి పథకాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం వివిధ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులకు అర్హత పొందిన లబ్ధిదారులకు పత్రాలను అందజేసిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేకనే బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ పథకాలపై కొన్ని పార్టీలు చేసే దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల ముంగిట్లోకి తెచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లాలోని కేటీ అన్నారంలో, ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మల్లెపల్లిలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అనర్హులు ఎవరైనా లబ్ధి పొందితే స్వచ్ఛందంగా వాటిని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని, అనర్హులను గుర్తిస్తే అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనర్హులకు పొరపాటున పథకాలు అందితే మధ్యలోనే నిలిపివేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తిలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. భువనగిరి జిల్లా నాతాళ్లగూడెం గ్రామంలో మంత్రి ఉత్తమ్ మాట్లా డుతూ ఓడిపోయామన్న బాధతోనే బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం ఖానాపురంలో మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఆసరాగా ఉండేందుకు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ములుగు జిల్లాలో మం త్రి సీతక్క, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం వెంకట్రావుపెల్లిలో మంత్రి సీతక్క, నాగర్‌కర్నూల్ జిల్లాపసుపులలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.
కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా?
అసెంబ్లీ ఎన్నికలు జరిగి 14 నెలలు గడుస్తున్నా ప్రతిపక్ష నేత కేసీఆర్ ముఖం చాటేస్తూ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యాడని, అలాంటి వారికి ప్రతిపక్ష హోదా అవసరమా అని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్ గౌడ్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా అప్పారెడ్డిగూడలో ఆయన మాట్లాడుతూ తండ్రేమో ఫామ్‌హౌ్‌సకు పరిమితమవుతాడు.. కొడుకు, అల్లుడేమో రోడ్ల మీదకొచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు.
ఇందిరమ్మ ఇల్లు రాలేదని మహిళ కన్నీరు
యాదాద్రి జిల్లా గుండాల మండలం బూర్జుబావి గ్రామంలో ఆదివారం అర్హులకు పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తోటకూరి బొజ్జమ్మ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కాలేదు. దాంతో బొజ్జమ్మ విలపిస్తూ గ్రామంలో ఇల్లు ఉన్న వారికి ఇల్లు మంజూరైందని, తన ఇల్లు పూర్తిగా కూలిపోయిన్నప్పటికీ రాలేదని ఇదెక్కడి న్యాయమని కన్నీరు పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేప పుల్లతో తోమిన పళ్లు అవి.. ఆ కుర్రాడి దంత శక్తిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితే.. ``8``ల మధ్యనున్న ``6``ను కనిపెట్టండి..
Funny Viral News: భర్త మొహానికి లాక్.. బోనులో బంధించిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Snake bite video: పాపా.. పాముతో ఆటలాడితే అలాగే ఉంటుంది.. ఓ యువతి పరిస్థితి ఏమైందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి