Press Academy: పేపర్ హ్యాకర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ABN , Publish Date - Jan 16 , 2025 | 04:04 AM
పేపర్ హ్యాకర్లు (పత్రికలను ఇంటింటికి వేసే వారు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివా్‌సరెడ్డి
కాప్రా, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): పేపర్ హ్యాకర్లు (పత్రికలను ఇంటింటికి వేసే వారు) ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె.శ్రీనివా్‌సరెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన తెలంగాణ ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ల సంఘం రాష్ట్ర రెండో మహాసభకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. దినపత్రికలను ఎంత అందంగా ముద్రించినా.. ఆ పత్రిక పాఠకుడి వద్దకు చేరకపోతే దానికి విలువ ఉండదన్నారు. ప్రచురితమైన పత్రికలను పాఠకుల వద్దకు చేర్చడంలో హ్యాకర్ల పాత్ర కీలకం అని పేర్కొన్నారు.
పేపర్ హ్యాకర్లకు అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తింపు లభిస్తే ప్రభుత్వం తరపున వారికి అనేక ప్రయోజనాలు అందుతాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హ్యాకర్లకు అన్ని సౌకర్యాలు కల్పించేలా తన వంతు కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనమాల సత్యం, ప్రధాన కార్యదర్శి రాంప్రసాదరావు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు రాజేందర్, కర్ణాటక నుంచి ప్రశాంత్, బూపేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటరమణ, ఈసీఐఎల్ ఏరియా ప్రతినిధులు శ్రీను ధశరథ్, గంగాధర్, బిజ్జు, హమీద్, ఎం.నరేష్, కె.నరేష్, శ్రీనివాస్, సంఘం 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పేపర్ వెండర్లు, డిస్ట్రిబ్యూటర్లు, పేపర్ హ్యాకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.