Share News

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:51 PM

మేడిగడ్డ అంశంపై కేసీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగిన వ్యవహారంపై..

Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
Medigadda barrage

హైదరాబాద్, ఫిబ్రవరి 24: మేడిగడ్డ అంశంపై కేసీఆర్ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. మేడిగడ్డ కుంగిన వ్యవహారంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో సవాల్ చేశారు. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి చనిపోయాడని కోర్టుకు తెలిపారు కేసీఆర్ తరఫు అడ్వకేట్. అయితే, కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా.. పిటిషన్ మెయిన్‌టేనబుల్ అని పీపీ వాదించారు. పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్‌ను ఇంప్లీడ్ చేసి మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు పీపీ. అయితే, పీపీ వాదనలను వ్యతిరేకించారు కేసీఆర్ తరఫున లాయర్. లీగల్ హైర్‌ను ఇంప్లీడ్ చేయడం అనేది సమన్స్ కేసుకకు మాత్రమే వర్తిస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్‌కు ఆస్కారం లేదన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.


అసలేం జరిగింది..

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావులను బాధ్యులను చేస్తూ రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కేసీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. అయితే, జిల్లా కోర్టు తన పరిధికి మించి ఉత్తర్వులు జారీ చేసిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ హైకోర్టు ఆశ్రయించారు. భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. దీనిపై హకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఫిర్యాదుదారుడైన రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. దీంతో పిటిషనరే చనిపోయాక.. పిటిషన్‌కు విచారణార్హత ఎలా ఉంటుందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇటు పబ్లి్క్ ప్రాసిక్యూటర్, అటు కేసీఆర్, హరీష్ రావు తరఫు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా? అని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు.. సామాన్యుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.


Also Read:

వంశీకి బిగ్ షాక్..

టీమిండియా విక్టరీ.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాబా

హైదరాబాద్‌లో మటన్, చేపల ధరలకు రెక్కలు

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 24 , 2025 | 03:51 PM