Hyderabad: వణికిస్తున్న చలి.. పటాన్‌చెరులో అత్యల్పం
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:58 AM
శివారు ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. శుక్రవారం పటాన్‌చెరు(Patancheru)లో అత్యల్పంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్(Rajendranagar) ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ సిటీ: శివారు ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. శుక్రవారం పటాన్‌చెరు(Patancheru)లో అత్యల్పంగా 8.4 సెల్సియస్ డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా రాజేంద్రనగర్(Rajendranagar) ప్రాంతంలో 10 సెం.మీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణంగా 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలిగాలులతో రాత్రుళ్లు బయట అడుగుపెట్టేందుకు ప్రజలు వణికిపోతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త..
కాగా, బేగంపేటలో 13.6, దుండిగల్(Dundigal)లో 13.8, హయత్‌నగర్‌లో 14, హకీంపేట(Hakimpeta)లో 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళల్లో పొగమంచు ప్రధాన రహదారులను కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు గ్రేటర్‌లో వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని బేగంపేట(Begumpet) వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News