Share News

కీచకుడు దొరికాడు.. ఎంఎంటీఎస్ రైల్లో యువతి ఘటనలో నిందితుడు గుర్తింపు

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:45 PM

కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పలు బృందాలుగా ఏర్పడి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు.

కీచకుడు దొరికాడు.. ఎంఎంటీఎస్ రైల్లో  యువతి ఘటనలో నిందితుడు గుర్తింపు

సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్‌గా గుర్తించారు. రైల్లో లైంగిక దాడికి యత్నించింది అతడే అంటూ ఫొటో ఆధారంగా బాధితురాలు గుర్తించింది. జంగం మహేష్ ఫొటో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడ్చల్ జిల్లాలోని గౌడవెల్లికి వెళ్లారు. ఏడాది క్రితమే మహేష్‌ను భార్య వదిలివేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మహేష్ ఒంటరిగా జీవిస్తున్నాడు. గంజాయికు బానిసైన మహేష్‌ను పాత నేరస్తుడని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదుల యత్నం.. పోలీసుల అరెస్టు..

రజినీ ఫిర్యాదుతోనే తనిఖీలు: జాషువా

మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..

ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

For More AP News and Telugu News

Updated Date - Mar 25 , 2025 | 10:18 PM