YS Viveka Case: సునీతను ఇరికించే కుట్ర..
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:50 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ కేసు విచారణకు సంబంధించి.. జరుగుతున్న పరిణామాల పట్ల పూర్తిస్థాయిలో అందులో పొందుపరచింది. ముఖ్యంగా ఈ కేసులో వైస్ వివేకా కుమార్తె సునీతాను, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని ఇరికించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అలాగే ఈ కేసుపై విచారణ పూర్తి స్థాయిలో చేయలేకపోయారని, ఇందులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తెలిసినా అరెస్ట్ చేయకపోవడం తదితర అంశాలపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
