బ్రాహ్మణి చీరపై వాల్మీకి చరిత్ర
ABN, Publish Date - Mar 21 , 2025 | 03:17 PM
Brahmani Saree Valmiki Print: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి కట్టుకున్న చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తిరుమల, మార్చి 21: తిరుమల శ్రీవారిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కుటుంబం ఈరోజు (శుక్రవారం) దర్శించుకుంది. ఈ సమయంలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సతీమణి నారా బ్రాహ్మణి (Brahmani) ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రాహ్మణి కట్టుకున్న చీరపై వాల్మీకి చరిత్ర ఉంది. చీరపై డిజైన్ రూపంలో వాల్మీకి చరిత్రను ప్రింట్ చేశారు. సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఉదయం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనార్ధం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి వెళ్ళారు. ఆపై వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యలతో కలిసి సీఎం చంద్రబాబు ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఇవి కూడా చదవండి...
Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Read Latest AP News And Telugu News
Updated at - Mar 21 , 2025 | 03:29 PM