Home » Andhra Pradesh » Chittoor
Andhrapradesh: టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హుండీలో పడిన విదేశీ కరెన్సీనీ వజ్రాలను దోచుకున్న రవి అనే వ్యక్తితో జగన్ ప్రభుత్వంలోని టీటీడీ ఉన్నతాధికారులు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు.. టీటీడీ విజిలెన్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసు నీరుగారేలా చేసినట్లు విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.
సూళ్లూరుపేట వేదికగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ తేదీలు మారినట్లు తెలిసింది. తొలుత జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సి ఉండేది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రావడం, శ్రీవారి దర్శనానికి వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఫ్లెమింగో ఫెస్టివల్ (పక్షుల పండుగ)ను సంక్రాంతి తర్వాత నిర్వహించాలని యంత్రాంగం భావించింది. ఆ ప్రకారం జనవరి 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడానికి కలెక్టర్ వె ంకటేశ్వర్ నిర్ణయం తీసుకున్నారు. గత షెడ్యూల్లో ఏవిధంగా కార్యక్రమాలు, వేదికలు ఉన్నాయో అదే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కలెక్టర్ నేతృత్యంలో కమిటీ సంసిద్ధమైంది.
కోట మండలం కర్లపూడి బీసీ కాలనీలోని ఊడత వెంకటసుబ్బయ్యకు ముగ్గురు పిల్లలు. మొదటి ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఆ తర్వాత జన్మించిన ఇద్దరు కుమారులు.. నాగరాజు, హర్షకు చిన్నప్పటి నుంచీ శరీరం, ముఖం, నల్లగా మాడిపోయి దద్దులుగా ఉన్నాయి. చర్మంపై చెమట పట్టకుండా తడి ఆరిపోయి పట్టలు పట్టలుగా పగిలిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో రక్తం, నీరు కారుతూ ఉంటాయి. రాత్రి వేళ నిద్రపోలేని పరిస్థితి. వర్షాకాలం ఒకలా.. ఎండలోకి వెళ్లితే మరోలా వీరిద్దరి చర్మం మరింతగా బిగిసుకుపోయి పగిలిపోతుంది. తమ పిల్లల నరకయాతనను చూడలేక తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. మంగళవారం తెల్లవారు జామున సూళ్లూరుపేటలో చలి గాలులతో కూడిన తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇది బలపడితే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న క్రమంలో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి. సముద్రంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అల్లకల్లోలంగా ఉంటుందని మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కాగా, కోట మండలం గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాల సమీపంలో మంగళవారం సముద్రం కల్లోల భరితంగా మారింది. దీంతో మత్స్యకారులు చేపలవేట నిలిపివేశారు.
ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టంచేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి మొదటి వారంలో జిల్లాలో మూడు డిసిల్టేషన్ పాయింట్ల నుంచి ఇసుక ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,37,686మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. స్వర్ణముఖి నదీ తీరప్రాంతమైన పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామం, దిగువకలువకూరు, కోట మండలం గుడాలిగ్రామంలో ఇసుక అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
నగరి మండల పరిదిలోని గుండ్రాజుకుప్పం పంచాయతీలో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఓదశలో అధికారుల ముందు రికార్డులు పెట్టివున్న టేబుళ్లను సైతం నెట్టివేశారు. ఒక వర్గంపై మరొక వర్గం వారు ఆరోపణలు చేసుకుంటూ నువ్వు కబ్జా చేశావంటే నువ్వు చేశావంటూ తీవ్రస్థాయిలో బల్లలు గుద్ది వాదించుకున్నారు. 35 ఏళ్లలో కాపాడిన ఆస్తులను గత ఐదేళ్ల పాలనలో సర్పంచ్ బాలచంద్రారెడ్డి కబ్జా చేశారని, పట్టాలు లేకనే ఇంటి స్థలాలు ఇచ్చారని టీడీపీ వర్గీయులు లక్ష్మీపతిరాజు, ఉమాపతిరాజు విమర్శించారు.
చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ.4.71 కోట్ల ఎంపీ నిధులు కేటాయించినట్లు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని గ్రామాలకు మంజూరైన 85 రకాల వివిధ అభివృద్ధి పనులకుగాను ఇప్పటికే రూ.4.71 కోట్ల ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం కోసం అమలుచేసే పథకాల లక్ష్యాలను ప్రైవేటు బ్యాంకర్లు ఎందుకు పూర్తిచేయడం లేదంటూ కలెక్టర్ సుమిత్కుమార్ ఆ బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశం, లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట పెట్టుబడిగా అవసరమైన పంట రుణాలు, స్వల్పకాలిక రుణాలు వంటి రుణాల మంజూర్లలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులంటూ తారతమ్యం లేకుండా అన్ని బ్యాంకులు రుణమంజూర్లలో లక్ష్యాలను పూరిచేయాల్సిందేనని అన్నారు. ప్రైవేటు బ్యాంకులు లక్ష్యాలు పూర్తిచేయడంలో అనాసక్తి చూపడం తగదన్నారు.
దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. స్విమ్స్ హస్పిటల్కి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Andhrapradesh: చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన మోహనాచారికి భార్య, కుమారుడు ఉన్నాడు. అయితే తన భార్యను సచివాలయంకు చెందిన ఓ ఉద్యోగి ట్రాప్ చేశాడంటూ మోహనాచారి ఆత్మహత్య చేసుకున్నాడు.