TTD: భక్తులకు అలర్ట్... టీటీడీ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:03 PM
దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. స్విమ్స్ హస్పిటల్‌కి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
తిరుమల: తిరుమల అభివృద్ధిపై టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. స్విమ్స్ హస్పిటల్‌కి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు అందించే సేవలపై ఫీడ్‌బ్యాక్‌ను ఏపీ డిజిటల్ సహకారంతో స్వీకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. తిరుమలలో ఉన్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేస్తున్నామని అన్నారు. అన్నప్రసాదంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు ప్రకటించారు..
కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు రూ. 2 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తిరుమలలో నూతనంగా పుడ్ సేఫ్టీ విభాగాన్ని నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. భక్తులు సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ వద్ద రూ.3.6 కోట్లతో టాయిలెట్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఒంటిమిట్ట రామాలయంలో రూ. 42 లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమల..శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చేయడానికి నోటీసులు జారీ చేశామని అన్నారు. మఠం నిర్వాహకులు ఇచ్చే సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Nadendla Manohar: ఆ చట్టంపై అవగాహన ఉండాలి
Chandrababu Naidu: ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు.. కారణమిదే..
YCP: వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
Minister Nara Lokesh : శ్యామ్ బెనగల్ మృతికి లోకేశ్ సంతాపం
Read Latest AP News And Telugu news