Home » Andhra Pradesh » Chittoor
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో జరిపిన నాలుగు రోజుల పర్యటన విజయవంతమైంది.
వ్యవసాయం అంటే ఇష్టపడే మురళి బీకాం పూర్తి కాగానే వ్యవసాయంపై దృష్టి సారించారు.ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు.సోమల మండలం కరకమందకు చెందిన మురళి పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించేశారు.
ఇటీవల పడిన వర్షాలతో పశువులు అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాయి.పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తలపెట్టిన గోకులం షెడ్ల నిర్మాణంలో క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వంతో ఆశించిన పురోగతి లేదు.
తెనాలికి చెందిన శ్రీనివాస్ మధ్యతరగతికి చెందిన వ్యక్తి. తిరుమలలో గది కోసం రెండు నెలల పాటు ఓ నాయకుడి చుట్టూ తిరిగి ఎట్టకేలకు సిఫార్సు లేఖ పొందారు.
వడమాలపేట మండలంలోని సదాశివ కోనకు వెళ్లొస్తుండగా తప్పిపోయిన యువకుడిని సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు రక్షించారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది.
కోటీశ్వరుడి నుంచి కూలీ వరకు.. ఐదు వేళ్లు నోట్లోకి పోవాలంటే రైతు చెమటను చిందించాలి. నష్టం వచ్చినా.. ప్రకృతి సహకరించక పోయినా.. సేద్యం చేస్తూ.. అందరి ఆకలి తీరేది. అలాంటి అన్నదాతలకోసం డిసెంబరు 23న (సోమవారం) జాతీయ రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు.
జగనన్న కాలనీల్లో అవినీతి, అక్రమాలపై విజిలెన్సు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 5 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న రెండు ప్రాంతాల్లోనే ఇప్పటికి రూ.4.56 కోట్ల అవినీతి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
బిడ్డలను చదివించుకోవాలని కష్టపడి కువైట్కు వెళ్లిన మహిళకు కష్టాలు మిగిలాయి. గొడ్డు చాకిరీ చేసినా కనికరంలేదు. కడుపునిండా తిండిలేదు. కంటినిండా కునుకు లేదు. ఒక్క పూట భోజనం, గ్లాసు మంచినీళ్లతో మూత్రంలో రక్తస్రావమవుతూ నరకం అనుభవిస్తోంది శ్రీకాళహస్తికి చెందిన ఓ మహిళ.
చిత్తూరు జిల్లాలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు. శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి గ్రామానికి వెళ్లి స్థానిక మహిళలతో ఆమె ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వారితో స్థానిక విషయాలు సహా మహిళల సమస్యలపై చర్చించారు.
తిరుపతి డెవలప్మెంట్పై టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విదంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.