Home » Andhra Pradesh » Chittoor
తిరుపతి డెవలప్మెంట్పై టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. తిరుమల పవిత్రతను కాపాడే విదంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుటుంబ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు.
చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది స్త్రీలేనని వారి శక్తి అపారమని, వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ మెరైన్ పోలీసులకు సూచించారు. తూపిలిపాలెం, దుగరాజపట్నం బీచ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘కోడి బొచ్చును కూడా నెలకు రూ.20లక్షలకు అమ్ముకునే వాళ్లు మనకు ఎమ్మెల్యేలుగా కావాలా?’ అని ఎన్నికల ముందు జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో జరిగిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ఇంతకీ కోడి బొచ్చు కథేంటి? అంటూ అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి రూపురేఖలు మరో ఆరు నెలల్లో మారనున్నాయి. కుప్పం తరహాలో నారావారిపల్లికి కూడా ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు.
వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం శనివారం బదిలీలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుపతి డీఎంహెచ్వో డాక్టర్ యు.శ్రీహరిని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రి సీఎ్సఆర్ఎంవోగా బదిలీ చేసింది.
రెవెన్యూ సదస్సుల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన 43 గ్రామసభల్లో 947 అర్జీలు వచ్చాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
సారాను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి ప్రభుత్వం మళ్లీ నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చిత్తూరు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాసాచారి తెలిపారు.
జిల్లా సహకారకేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ అధికారిగా నియమితులైన డీఆర్వో కె. మోహన్కుమార్ శనివారం మధ్యాహ్నం బ్యాంకుకు వచ్చారు.