Nara Bhuvaneshvari: ఐదేళ్ల రాక్షస పాలనపై రాజీలేని పోరాటం చేశాం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:05 PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుటుంబ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు.
చిత్తూరు: ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు మంచి సేవ చేయాలన్నదే నారా కుటుంబం లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తెలిపారు. ఐదేళ్లు జగన్ రాక్షస పాలనపైన సీఎం చంద్రబాబు రాజీలేని పోరాటం చేశారని చెప్పారు. ఇవాళ(ఆదివారం) చిత్తూరులో భవనేశ్వరి పర్యటించారు. శాంతిపురం మండలం చేల్దగాని పల్లి వద్ద మహిళలతో ముఖాముఖిలో నారా భువనేశ్వరి మాట్లాడారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి కుటుంబ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు.
కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. చంద్రబాబు నాయుడును కుప్పంలో ఎనిమిది సార్లు ఎన్నికల్లో క్రమం తప్పకుండా గెలిపించడం అది మీ యొక్క అభిమానం ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసుల్లో చంద్రబాబునాయుడు అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రజలు,కార్యకర్తలు అందరూ రోడ్లపైకి వచ్చి పోరాడారని గుర్తుచేశారు. అది మరింత రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబు కుటుంబం కంటే ప్రజలు, కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, కార్యకర్తలు అండదండలతో మళ్లీ చంద్రబాబు సుపరిపాలన తీసుకొచ్చారని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకోవాలని నారా కుటుంబానికి లేదని భువనేశ్వరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు
CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ
Mystery Unfolds : మరిదే సూత్రధారి!
Read Latest AP News and Telugu News