Home » Andhra Pradesh » Guntur
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇవాళ్టి (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటిలాగానే రూ.100లు కట్టి సాధారణ సభ్యత్వం తీసుకోవచ్చంటూ తెలుగు తమ్ముళ్లు పార్టీ శుభవార్త చెప్పింది. ఎవరైనా లక్ష రూపాయలు కడితే వారికి శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్ధసారధి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పరువు తీసే పనులు జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లి, తల్లికే అన్యాయం చేశాడని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారని అన్నారు.
జగన్ ప్రభుత్వంలో భూ కబ్జాలు , విధ్వంసాలు, గంజాయి మత్తు పదార్థాలు బాగా పెరిగిపోయాయని.. కూటమి ప్రభుత్వం అన్నింటికీ అడ్డు కట్ట వేసిందని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. తొలిసారిగా విశాఖపట్నంలో జిల్లా సమీక్ష సమావేశం ఇవాళ(శుక్రవారం) నిర్వహించామని తెలిపారు.
ఉచిత ఇసుక పాలసీ 2024లో సినరేజీ ఫీజు మాఫీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మైన్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.ఉచిత ఇసుక పాలసీపై ఈ నెల 21 న జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్‌లలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. దాచేపల్లిలో పరిస్థితి ఎలా ఉందంటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం దాచేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రికి కలెక్టర్ చెప్పారు.
రాజధాని రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలపడం శుభపరిణామమని పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2017 నవంబరు 13న ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇచ్చామని తెలిపారు.
గ్రామపంచాయతీల నిధులు కూడా మాజీ సీఎం జగన్ దోచుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సింపతీ క్రియేట్ చేయడం జగన్‌కి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన అని హోంమంత్రి అనిత విమర్శించారు.
జగన్ షర్మిల ఆస్తి వివాదంపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తల్లికి, చెల్లికి ఇంట్లో గొడవ అయితే తమను అందులోకి లాగుతున్నారని ధ్వజమెత్తారు. విలువలు లేని రాజకీయం చేసి, హీరోయిజం చేయాలనుకుంటే ఇక మీదట కుదరదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే రెండు నెలల్లోశంకుస్థాపన చేస్తామని తెలిపారు. మూడేళ్లలో రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. తమకు మరింతగా ఉపయోగ పడుతుందని అన్నారు.