Home » Andhra Pradesh » Guntur
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కల్తీ ఆహారంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధినిల ఆందోళన నేపథ్యంలో బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించి, త్వరితగతిన నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నుదీర్ఘంగా సీడబ్ల్యూసీ సమావేశం 5 గంటల పాటు జరిగిందని.. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించామని సీడబ్ల్యూసీ మెంబర్ పల్లంరాజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతి, ఇతర అంశాలపై చర్చించామని తెలిపారు.
ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా 68 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది.
జగన్ ప్రభుత్వంలో ఇసుక, బీచ్ శాండ్, బొగ్గు, గనుల వ్యవహారంలో ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గనుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు.
2015 జులై 14న నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యువతి సూసైడ్ నోట్ రాసింది. సీనియర్ విద్యార్థుల వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది.
ఫంగల్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ., నాగపట్నానికి 330 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ., చెన్నైకి 430 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైందని కూర్మనాథ్ వెల్లడించారు.
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి, పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామిరెడ్డి ని అర్థరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు.
గడచిన ఐదేళ్లూ రైతుల సంక్షేమాన్ని విస్మరించడమే కాకుండా వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఘనత వైసీపీది. 2014--19 మధ్య కొనసాగిన అనేక పథకాలకు గత పాలకులు మంగళం పాడారు.