Share News

Deputy Collectors: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్లర్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Nov 29 , 2024 | 07:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెను మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసిన చంద్రబాబు సర్కార్.. తాజాగా 68 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది.

Deputy Collectors: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్లర్లు బదిలీ.. ఉత్తర్వులు జారీ

అమరావతి: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. 68 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ GAD ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ జీవోఆర్టీనెంబర్ 2033ను ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రఘువీర్ రెడ్డిని ఎన్నికల సమయంలో బదిలీ చేసిన ఈసీ విషయం తెలిసిందే.


null

Updated Date - Nov 29 , 2024 | 07:48 PM