Home » Andhra Pradesh » Krishna
అవనిగడ్డ నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఆగడాలకు అదుపు లేకుండాపోయింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలు, పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇసుకాసురులు కృష్ణానది తీర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఫలితంగా తీర గ్రామాలు ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడగా, అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
వలంద పాలెంలో తాపీమేస్ర్తీ విద్యుత్ఘాతంతో మృతిచెందాడు.
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిం చాలని రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల సంతకాల సేకరణ చేపట్టనున్నామని ఎన్ఎఫ్డీసీ జాతీయ చైర్మన్ ఇందుపల్లి ఆనందకుమార్ అన్నారు.
రైతులకిచ్చిన హామీలను అమలుచేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కోడూరు నుంచి విశ్వనాథపల్లి గ్రామానికి వెళ్లే 7.5 కిలోమీటర్ల రహదారి రెండేళ్లుగా అధ్వానంగా ఉంది.
Andhrapradesh: ఎన్నో పథకాలు ఇస్తామని దేనికీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని వైసీపీ ఎమ్మెల్యే కళ్యాణి విమర్శలు గుప్పించారు. ప్రజలను కూటమి ప్రభుత్వం నిట్టనిలువుగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా 20 వేలు ఇస్తామన్నారని.. కేవలం రూ.5 వేల కోట్లే నిధులు పెట్టారన్నారు. తల్లికి వందనం పథకం కోసం కేవలం రూ.5300 కోట్లు కేటాయించారని..
Andhrapradesh: వైఎస్సార్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరగాలన్నారు. రేపు (మంగళవారం) బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు.
Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన అమ్మ ఒడి, ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించండం సంతోషకర విషయమన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేందుకు నీటిపారుదల శాఖకు గత ప్రభుత్వం కంటే రెండు రెట్ల అదనపు నిధులు...
Andhrapradesh: రూ.2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో అత్యధికంగా విద్య, నైపుణ్య రంగం , వైద్య, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయితీ రాజ్- గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి - రాష్ట్ర రహదారుల కోసం కేటాయింపులు చేశారన్నారు. అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తూనే వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం దాదాపు 23% బడ్జెట్ నిధులు కేటాయింపులు చేయడమంటే, ఈ వర్గాలను స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వామ్యం చేయడమని చెప్పవచ్చన్నారు.