Home » Andhra Pradesh » Nellore
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లా: వెంకటగిరి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీసాయిప్రియని గతంలో టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది. అయితే...
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: ఏపీలో ఎన్నికల సమయం వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయని, 2019లో కోడికత్తి , ఇప్పుడు గులకరాయి ... రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి కామెంట్స్ చేశారు.
Andhrapradesh: ‘‘ఆఫ్ టిక్కెట్ జగన్ నెల్లూరుకి వచ్చి అయిదేళ్లు అయింది. ముద్దులు పెట్టావు... మళ్ళీ ఈ రోజు నెల్లూరు వచ్చావు’’ అంటూ సీఎం జగన్పై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. శనివారం నెల్లూరు టీడీపీ కార్యాలయంలో టీడీఆర్ బాండ్స్ నకళ్లని ఆనం దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరుడు అవినీతి వద్దని చెప్పడం హాస్యాస్పదమని...‘‘మీ కుటుంబం అవినీతి కుటుంబం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు: పెన్షన్ పంపిణీ విధానంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచాతినీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నెల్లూరు: బలవంతంగా రూ. వంద ఇస్తాం.. రెండు వందలు ఇస్తామని చెప్పి వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు 10 నిముషాలు కూడా ఉండడంలేదు. అసలే ఎండాకాలం... వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం.. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబూ అంటూ వెయ్యి కళ్లతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్దాయన వచ్చినా జనం వింటారా? వినరు.
ఆత్మకూరు(Atmakur) నియోజకవర్గంలో నేటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ప్రారంభమవుతుందని నియోజకవర్గ టీడీపీ(TDP) అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana reddy) అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేటలో జరగబోయే బహిరంగ సభలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున చేరికలు..
డ్రైవర్కు నిద్ర మత్త ఆవహించిందో లేదంటే అతి వేగం కారణమో కానీ పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఓ డివైడర్ను ఢీకొట్టాడు. అంతే.. కారులో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పాల్వంచలో వివాహానికి హాజరైంది ఓ కుటుంబం. తిరిగి ఆనందంగా స్వగ్రామానికి బయలుదేరింది.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల నిబంధనలకి విరుద్ధంగా జిల్లాలోనే నలుగురు ముఖ్య అధికారులు పని చేస్తున్నారు. డీఆర్డీఓ పీడీ సాంబశివారెడ్డి, డీపీఓ సుశ్మిత రెడ్డి, డీఏఓ తిరుపతయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ చిరంజీవిలు నిబంధనల మేరకు బదిలీ కాలేదు.