Kotamreddy: వైసీపీ ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్..
ABN , Publish Date - Apr 04 , 2024 | 12:26 PM
నెల్లూరు: పెన్షన్ పంపిణీ విధానంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచాతినీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
నెల్లూరు: పెన్షన్ పంపిణీ (Pension Distribution) విధానంలో జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అనుసరిస్తున్న విధానంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు (Old People), దివ్యాంగులకు (Disabled) నేరుగా ఇళ్లవద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశిస్తే.. ఓటమి తప్పదని భావించిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ విధానంపై నీచాతినీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొన్ని చోట్ల వైసీపీ శ్రేణులు (YCP Activists) వృద్ధులను మంచాలపై తీసుకువస్తున్నారని అన్నారు. వారిని మంచాలపై తీసుకురమ్మని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. వృద్ధులు, నడవలేనివారు, దూరంగా ఉన్నవారు, దివ్యాంగులకు నేరుగా వాళ్ల ఇళ్లవద్దకే వెళ్లి పెన్షన్లు లందజేయాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా? లేదా? అని ప్రశ్నించారు. దీనికి వైసీపీ నేతలు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఎన్ని శవరాజకీయాలు, విన్యాసాలు చేసినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. సచివాలయం ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారితో ఇళ్లవాద్దకు పెన్షన్లు పింపిణీ చేయవచ్చునని.. అలా ఎందుకు చేయడంలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.