AP News: తీర ప్రాంతంపై జగన్ కళ్లు..: ఆనం వెంకటరమణారెడ్డి
ABN , Publish Date - Apr 16 , 2024 | 01:13 PM
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్‌గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
నెల్లూరు: ఏపీ (AP) తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్‌గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం (TDP) అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkataramana Reddy) ఆరోపించారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన నెల్లూరు (Nellore)లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కేఎస్పీఎల్ (KFCl) మీద దాడి చేశారని, షేర్‌లు ఇవ్వాలని తుపాకీలతో బెదిరింపులకు దిగారన్నారు. అయితే జె గ్యాంగ్ (J Gang)కు కేఎస్పీఎల్ యాజమాన్యం లొంగలేదని.. దీంతో రూ. 965.65 కోట్లు ఎగ్గొట్టినట్లు ఆడిట్ రిపోర్ట్ తయారు చేసి.. జైళ్లకు పోతారంటూ హెచ్చరించారు.
అరబిందో (Aurobindo) సంస్థకు షేర్లు అమ్మాలంటూ బెదిరింపులకు దిగారు. దీంతో షేర్లు ఇచ్చాక కట్టాల్సిన రూ. 965.65 కోట్లు కాస్త రూ.9 కోట్లుగా మారిందన్నారు. రూ. 200 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ షేర్లు జగన్ బినామీలు కొట్టేసారని.. తెలుగుదేశం అధికారంలోకి రాగానే వడ్డితో సహా వసూలు చేస్తామని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
TS News: స్నేహితులతో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!
Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..