Home » Andhra Pradesh » Nellore
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు.
Andhrapradesh: ఎన్నికల ముందు అధికార పార్టీ వైఎస్సార్సీపీకి జిల్లాలో భారీ షాక్ తగిలింది. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి దంపతులు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వేమిరెడ్డితో పాటు వైసీపీ నేతలు టీడీపీలో భారీగా చేరారు.
జిల్లాలో ఓ వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే మరోసారి రెచ్చిపోయారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అధికార వైసీపీ పలు కుయుక్తులు పన్నుతోంది. కుట్రలో భాగంగా వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి(Mla Pratapkumar Reddy) అరాచకాలు సృష్టిస్తున్నారు.
అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జోరుగా పర్యటిస్తున్నారు. ‘రా కదలి రా’ సభల ద్వారా మేనిఫేస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2న నెల్లూరు, గురజాలలో.. 4న రాప్తాడులో పర్యటించనున్నారు.
నెల్లూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.
నెల్లూరులో మార్చి నెల 2వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఉండనుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వీపీఆర్ కన్వెన్షన్లో ఏర్పాట్లని టీడీపీ నేతలు పరిశీలించారు. మార్చి 2వ తేదీన నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారన్నారు.
Andhrapradesh: అనంతపురం, కడపని మించి సర్వేపల్లిలో అరాచకాలు సాగుతున్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గడ్డపారతో తమపై హత్యాయత్నానికి పాల్పడితే, తిరిగి తమపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు.
నెల్లూరు జిల్లా: కొవ్వూరులో వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోయాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు బరితెగించి అరాచకం సృష్టిస్తున్నారు. పోతిరెడ్డిపాళెంలో తిప్పను భారీ యంత్రాలతో తవ్వి రూ. కోట్లలో అక్రమ గ్రావెల్ అమ్మకాలు సాగిస్తున్నారు.
నెల్లూరు: భగత్ సింగ్ కాలనీలోని టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఈ సందర్బంగా టీడీపీ శ్రేణులు నగరంలో భారీ బైకు ర్యాలీలు నిర్వహించారు.
ఒంగోలు ‘సిద్ధం’ సభలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అవే అబద్ధాలు చెప్పారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy ) అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 2 సెంట్ల ఇంటి పట్టాను పేదలకు ఇస్తే... సెంటుకు జగన్రెడ్డి కుదించారని మండిపడ్డారు.