Share News

Shock for YCP: నెల్లూరు నగరంలో వైసీపీకి భారీ షాక్..

ABN , Publish Date - Feb 28 , 2024 | 02:00 PM

నెల్లూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.

Shock for YCP: నెల్లూరు నగరంలో వైసీపీకి భారీ షాక్..

నెల్లూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) భారీ షాక్ (Big Shock) తగిలింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ (Roop Kumar Yadav) రాజీనామా చేశారు. ఆయనతోపాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం నెల్లూరులో రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి వైసీపీకి సేవ చేశానని.. పార్టీ కోసం పని చేసిన తాము బయటకు రావడం భావోద్వాగానికి గురి చేస్తోందన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన పరిణామాలు మనసును బాధించాయని, పార్టీ కోసం కష్టపడ్డాం.. పోరాడాం.. పార్టీ మాది అనుకున్నామని.. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు. తనను ఆదరించిన నెల్లూరు నగర ప్రజలను మరువలేనన్నారు. సహచర నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ రాజకీయ నిర్ణయంపై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీకుంటామన్నారు. నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ వలన పార్టీ నుంచి దూరం కావడం లేదన్నారు. ఖలీల్, తాను దశాబ్దాలుగా కలసిమెలసి తిరిగామని రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 02:02 PM