Home » Andhra Pradesh » Nellore
నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం వేమిరెడ్డి ఉన్నారు. ఆయన సతీమణి వచ్చేసి టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు.
సీఎం జగన్ రెడ్డి.. ఏపీకు కొత్త పరిశ్రమలను తేకపోగా ఉన్న వాటిని తరిమేస్తారా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు పెట్రేగిపోతున్నారు. కొడవలూరు మండలం సంజీవనగర్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. బీసీలు, ఎస్టీలని బెదిరిస్తూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు బెల్లం వెంకయ్యనాయడు అరాచకం సృష్టిస్తున్నారు.
Andhrapradesh: కృష్ణపట్నం పోర్ట్ మూతపడుతుందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి కాకాణి కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడుతాను అని ప్రకటన చేశారని అన్నారు.
ఉమ్మడి నెల్లూరు: ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాధ్ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్ఎల్వీ ఎఫ్-14 (Gslv. F-14) రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ ప్రయోగం విజయవంతం చేస్తామన్నారు.
Andhrapradesh: బర్డ్ ఫ్లూతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోంది.
ఆటో డ్రైవర్లు, యజమానులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మీయ సమావేశం జరగనుంది. సీఎం జగన్ ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లు, యజమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విపరీతంగా జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వెంకటాచలం మండలం పవన్ కాలనీకి చెందిన 64 ఏళ్ల జయమ్మ, 60 ఏళ్ల రాజేశ్వరి మూడు రోజులు కిందట అధృశ్యమయ్యారు.
నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ మాఫియా గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. సీమ ప్రాంతానికి చెందిన ‘పెద్ద’ మంత్రి, నెల్లూరు జిల్లాకి చెందిన మంత్రి, మాజీ మంత్రి రౌడీ గ్యాంగులు హల్ ఛల్ చేస్తున్నాయి. భారీ ఎత్తున వందల కోట్ల రూపాయల క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతలే కాదు.. వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. నెల్లూరులో ఒకే సారి వైసీపీని వీడి వందలాది మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఇవాళ సాయంత్రం వందలాది మంది టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.