Share News

AP News: నెల్లూరు జిల్లాలో పెట్రేగిపోతున్న వైసీపీ నేతలు

ABN , Publish Date - Feb 19 , 2024 | 08:27 AM

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు పెట్రేగిపోతున్నారు. కొడవలూరు మండలం సంజీవనగర్‌లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. బీసీలు, ఎస్టీలని బెదిరిస్తూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు బెల్లం వెంకయ్యనాయడు అరాచకం సృష్టిస్తున్నారు.

AP News: నెల్లూరు జిల్లాలో పెట్రేగిపోతున్న వైసీపీ నేతలు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు పెట్రేగిపోతున్నారు. కొడవలూరు మండలం సంజీవనగర్‌లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. బీసీలు, ఎస్టీలని బెదిరిస్తూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు బెల్లం వెంకయ్యనాయడు అరాచకం సృష్టిస్తున్నారు. ఏడాదిగా 26 ఎకరాల ప్రభుత్వ భూముల్లో 20 నుంచి 30 అడుగుల మేర తవ్వకాలు కొనసాగిస్తున్నారు.

రూ.కోట్లలో గ్రావెల్ అక్రమ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గ్రావెల్ తవ్వకాలతో పరిసర గ్రామాల్లో నీటి సమస్య చోటు చేసుకుంది. వైసీపీ నేత బెల్లం వెంకయ్యనాయుడుపై గ్రామస్థులు తిరగబడ్డారు. భారీ యంత్రాలు, టిప్పర్లని వెంకయ్యనాయుడు పంపించేశారు. గ్రావెల్ తవ్వేది తవ్వేదే అంటూ జనాన్ని తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసన్నకీ వాటాలు పోతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Updated Date - Feb 19 , 2024 | 08:27 AM