Home » Andhra Pradesh » Prakasam
సమగ్ర శిక్ష ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న సెక్టోరల్ అధికారుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికిపైన అనర్హులుగా తేలారు. మొత్తం ఆరు పోస్టులకు 58మంది స్కూలు అసిస్టెంట్లు దరఖాస్తు చేయగా వీరిలో 26మంది మాత్రమే అర్హులని నిర్ధారించారు. 32మంది అర్హత లేని వారిగా గుర్తించారు. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టులో సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టులు ఉన్నాయి.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం క్షేత్రస్థాయిలో పేలవంగా సాగుతోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతో పొలం పిలుస్తోందిని ప్రభుత్వం అమలు చేస్తోంది.
అర్ధంతరంగా ఆగిపోయిన కూచిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తామని ఎంఈవో రంగయ్య తెలిపారు. ‘పరదాల కింద చదువు.. వానొస్తే సెలవు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
నాగులచవితి పండుగను మహిళలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలాత్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయం పుట్ట వద్ద మహిళలు పూజలు చేసేందుకు పోటీ పడ్డారు.
అర్థవీడు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి పనులపై వచ్చే ప్రజలకు పనులు జరుగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఒంగోలు నగరంలో మంగళవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకొని రూ.2.32 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సచివాలయ సెక్రటరీలు ప్రజలు మెచ్చేలా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఒంగోలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో సచివాలయ సెక్రటరీలు, కార్పొరేషన్ సిబ్బందితో సమీక్ష సమావేశం మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగింది.
మర్రిపూడిలో బీసీ బాలుర వసతి గృహం ఏర్పాటుకావాలన్న గ్రామస్థుల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యుడు అయిన డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చొరవతో ప్రభుత్వం హాస్టల్ను మంజూరు చేసింది.
మండలంలో ఏడాది కాలంలో జరిగిన ఉపా ధి పనుల్లో సుమారు రూ.5 కోట్ల మేర నిధులు గోల్ మాల్ జరిగినట్లు డ్వామా అధికారులు తెలిపారు. రూ.9 కోట్ల మేర పనులు జరగగా, అందులో రూ.4 కోట్ల 66 లక్షల రికవరీకి ఆదేశించినట్లు డ్వామా పీ డీ జోసఫ్కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక ఉపాధి కార్యాలయంలో 16వ విడత సామాజిక తని ఖీ ప్రజావేదిక నిర్వహించారు.
దశాబ్దాలకాలంగా నిర్మించతలపెట్టిన శ్రీబూచేపల్లి సుబ్బారెడ్డి మొగిలిగుండాల మినీ రిజర్వాయర్ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో పూర్తయి రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.