Home » Andhra Pradesh » Prakasam
రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం అడ్డగోలుగా ప్రైవేటు వెంచర్ల ను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
పోలీసు శాఖలో కీలకమైన కిందిస్థాయి ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈనెల 5న కౌన్సెలింగ్ నిర్వహించి స్థానచలనం కల్పించనున్నారు. ఈమేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాలు ఇచ్చారు.
వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన యువకుడిని ఒంగోలు ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను చెప్పిన విషయం విని వారు అవాక్కయ్యారు. తన సోదరులు రైళ్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని, దీంతో తనకు రైళ్లంటేనే కోపమని.. అందువల్లే దాడిచేశానని తెలపడం కొసమెరుపు.
మండలంలోని చందలూరు కొండ పోరంబోకు భూమిలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ‘యథేచ్ఛగా కొండభూమి కబ్జా’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై వారు స్పందించారు.
జాతీయ రహదారిలో తిమ్మనపాలెం చెక్ పోస్టు వద్ద నూతనంగా నిర్మిస్తున్న అండర్ పాస్ నిర్మాణంలో కోల్పోయే ఇళ్లను చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు మాట్లాడారు. శనివారం మండలంలోని తిమ్మనపాలెం గ్రామానికి వచ్చిన ఆయన కొత్తగా నిర్మించే ప్లైవోవర్, సర్వీస్ రోడ్డు కోసం భూ సేకరణ ప్రాంతాన్ని తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆర్డీవో పరిశీలించారు.
న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మకు న్యూజిలాండ్‌లోని మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన అసోసియేషన్ సభకు ఎమ్మెల్యేలను మంగళ వాయిద్వాలతో తీసుకెళ్లారు.
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వరుస కథనాలతో అధికార యంత్రాం గం కదిలింది. శనివారం తహసీల్దార్ పార్వతి, మైనింగ్ ఆర్ఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీకాంత్‌ల బృందం ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి దాడులు నిర్వహించారు. ఆ క్రమంలో తోటల్లో ఉన్న ఎక్స్‌కవేటర్‌ను గుర్తించారు. అధికారుల బృం దాన్ని చూచి ఎక్స్కవేటర్ డ్రైవర్ పరారయ్యాడు.
వ్యవసాయ పంటలకు రైతులు విద్యుత్ లైన్ల కోసం గతంలో దరఖాస్తులు ఇచ్చి ఏళ్లుగా కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను మంజురు చేయాలని ఆదేశాలిచ్చారు.
కొత్తపేట నుంచి వాడరేవుకు వెళ్లే దారిలో 216 జాతీయ రహదారి పక్కన నూతనంగా వేసిన విద్యుత్ స్తంభాలతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీనిపై స్థానికుల్లో చర్చ నడుస్తోంది. హాయ్ రెస్టారెంట్ ఎదురు వాడరేవు రోడ్డుకు ఒక వైపు స్థలం వ్యక్తుల దరఖాస్తు మేరకు నూతనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చే స్తున్నారు.
చీరాల మండల పరిధిలో వెనుకబడిన, గుర్తింపు పొందని వారి వివరాలను వేగవంతంగా సేకరించి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎంపీడీవో శివసుబ్రహ్మణ్యం అన్నా రు. మండల కార్యాలయంలో శనివారం సచివాలయాల సిబ్బందితో సమావే శం నిర్వహించారు.