Home » Andhra Pradesh » Prakasam
మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు పేర్కొన్నారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ హైస్కూల్లో ఏక్తా దివస్-24 కార్యక్రమాన్ని ఆర్డీవో జెండా ఊపి ప్రా రంభించారు.
ఒక వైపు సాగు నీరు అందించే డ్యాంల ద్వారా నీరు సముద్రం పాలు అవుతున్నా సాగులో ఉన్న పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. దీంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని వెంపరాల మేజర్ కాలువ ద్వారా ఎస్ఎల్ గుడిపాడు, వైదన, కొప్పెరపాడు, గొర్రెపాడు, కూకట్లపల్లి, కొత్తూరు, వెలమవారిపాలెం, వెంపరాల గ్రామాలోని సుమారు 5వేల ఎకరాలకు పైచి లుకు పంటలకు సాగు నీరు అందాల్సి ఉంది. ఈ మేజర్ కింద రైతులు వరి, నల్ల చెరకు పంటలను పెద్ద ఎత్తున సాగు చేశారు. గత పది రో జుల కిందట మేజర్ కాలువ మరమ్మతులతో నీటిని నిలిపివేశారు.
దుర్భిక్ష ప్రాంతానికి ఆశాదీపమైన వెలిగొండ ప్రాజెక్ట్‌పై ప్రజల ఆశలు మరోసారి చిగురించాయి. నిర్మాణ తీరుతెన్నులపై నిశిత పరిశీలన చేస్తూ.. ఆర్భాట హామీలు లేకుండా లొసుగులను చూస్తూ.. ముగ్గురు మంత్రులు సాగించిన పర్యటన, చెప్పిన మాటలు అందుకు తోడ్పడ్డాయి.
అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జిల్లాస్థాయి నేతల సంయుక్త సమా వేశం బుధవారం ఒంగోలులో జరగనుంది. స్థానిక భాగ్యనగర్‌లోని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి హాజరుకానున్నారు.
గ్రామసభల ద్వారా భూసమస్యలు పరిష్కారించేందుకు వీలుం టుందని తహసీల్దార్ కృష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు సందర్శన పండుగ వాతావరణాన్ని తలపించింది.
ప్రజల నుంచి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ల క్ష్యం అని చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయు డు అన్నారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్డీఓ చం ద్ర శేఖరనాయుడు హాజరై అర్జీలను స్వీకరించారు.
చీరాల మునిసిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ పీఎం స్వానిధి పథకానికి సంబంధించి రాష్ట్రస్థాయి అవార్డు తీసుకున్నారు.
దర్శి పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన సంఘటన కలకలం రేగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఎవరో కోసి చించివేశారు.
Andhrapradesh: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు.