Home » Andhra Pradesh » Visakhapatnam
అరకు ఉత్సవాలను వచ్చే జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో పర్యాటక ఉత్సవాలపై గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మన్యంలో ప్రస్తుతం కాఫీ పండ్ల సేకరణ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. దీంతో ఏజెన్సీలోని కాఫీ తోటల్లో గిరిజన రైతులు పండ్లను సేకరిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షాలు అనుకూలంగా ఉండడంతో కాఫీ పంట విరగ్గాసింది.
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు మంగళవారం, బుధవారం పర్యాటకులు పోటెత్తారు. వర్షాన్ని సైతం పర్యాటకులు లెక్కచేయకుండా పర్యాటక ప్రాంతాలను తిలకించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. మంగళవారం ఆరు వేల మంది పర్యాటకులు బొర్రా గుహలను సందర్శించగా రూ.5.30 లక్షల ఆదాయం వచ్చిందని, అలాగే బుధవారం ఐదు వేల మంది తిలకించగా రూ.5 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు.
జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం నేపథ్యంలో కాకరపాడు- పిట్టచలం గ్రామాల మధ్య అక్రమంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. రెవెన్యూ అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ మట్టి తవ్వకాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు పాత రోడ్డు నుంచి 10 అడుగుల మేరకు మట్టి తవ్వేయడంతో ప్రమాదాలకు నిలయంగా మారిందని ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
సహకార శాఖ పరిధిలో గల డీసీసీబీ, డీసీఎంఎస్‌లతోపాటు ప్రాథమిక సహకార సంఘాలకు పర్సన్ ఇన్చార్జుల నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
మండల కేంద్రం పరవాడలో ఓ రియల్టర్ బరి తెగించాడు. ఏకంగా పంచాయతీకి చెందిన రక్షణగోడను ఎక్స్కవేటర్ సాయంతో రాత్రికి రాత్రే కూలదోయించి తన లేఅవుట్‌కు రహదారిని ఏర్పాటు చేసుకున్నాడు. పరవాడ సంతబయలు నుంచి సినిమాహాల్ జంక్షన్‌కు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఈ తతంగం జరిగింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది.
నగర పరిధిలో ఎవరైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకుంటే పోలీస్ వెరిఫికేషన్ ఇకపై మూడు రోజుల్లో పూర్తిచేస్తామని సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.
జీకేవీధి మండలం సీలేరులో బుధవారం ఐటీఐ జంక్షన్ వద్ద ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చీపోయే వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఒడిశా సరిహద్దుల్లో పండించిన గంజాయిని టూరిస్టుల ముసుగులో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన స్మగ్లర్ల ముఠాలు రవాణాకు పాల్పడుతున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీలేరు ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టారు.
గిరిజనాభివృద్ధి, ప్రధానంగా విద్య, వైద్య రంగాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుండడంతో గతంలో ఏజెన్సీలో ఆరు కొత్త పీహెచ్‌సీల ఏర్పాటుకు చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తాయని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.