Home » Crime
పార్ట్‌టైం జాబ్ అంటూ నగరవాసిని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) పలు దఫాలుగా పెట్టుబడి పెట్టించి రూ.1.65 లక్షలు కాజేశారు. పార్ట్‌టైం ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతికిన నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి (44)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
అనుమానాస్పదస్థితిలో గృహిణి మృతి చెందింది. అల్వాల్ ఎస్ఐ సురేష్(Alwal SI Suresh) తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిసా రాష్ట్రం, బరంపూర్ ప్రాంతానికి చెందిన ఘనే కీర్తి(23)కి అదే ప్రాంతానికి చెందిన సామ్రాట్(25)తో 2022 నవంబర్‌లో వివాహం జరిగింది. సామ్రాట్ నగరంలోని హైటెక్ సిటీ(Hi-tech City)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
రోజురోజుకూ ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. అలాగే పోలీసుల అధికారుల పేరుతో అనేక రకాలుగా మోసాలు చేయడం కూడా పెరిగిపోతుంది. కళ్ల ముందు ఎన్ని నేరాలు జరిగినా అనేక మంది మోసపోతూనే ఉన్నారు. చివరకు చదువుకున్న విద్యావంతులు కూడా ఇలాంటి నేరగాళ్ల చేతిలో సులువుగా మోసపోవడం చూస్తున్నాం. తాజాగా..
ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట పోలీసులతో కలిసి సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు.
తన భర్తతో జరిగిన గొడవ కారణంగా తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ యువతి తిరుమల(Tirumala) నుంచి తన అన్నకు వీడియో పంపింది. దీనిపై అతడు నిమిషాల వ్యవధిలో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గంట వ్యవధిలోనే ఆమెను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మద్యం మత్తులో అక్కాచెల్లెళ్లతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడి చేసిన రౌడీషీటర్(Rowdy sheeter)కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
కూతురు ప్రసవం కోసం వెళ్తే ఇల్లు గుల్ల చేసిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station) పరిధిలో జరిగింది. బాధితులు మధుసూదన్‌రావు, సంధ్యారాణి దంపతులు, డీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. జయానగర్‌లో బిల్డర్ మధుసూదన్‌రావు తన భార్యతో కలిసి సీతా ప్యాలెల్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 301లో నివాసం ఉంటున్నారు.
మీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు తరలిందని, మీపై మనీ లాండరింగ్(Money laundering) కేసులు నమోదయ్యాయని బెదిరించిన సైబర్ నేగరాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.95 లక్షలు కాజేశారు.
ట్రేడింగ్‌లో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్ల(Cyber criminals) చేతిలో నగరానికి చెందిన ఓ బాధితుడు మోసపోయాడు. పెట్టుబడి పేరుతో పలు దఫాలుగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు.
బహిరంగ ప్రదేశాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలు, వాహన దారులు లక్ష్యంగా కొందరు నేరస్తులు దారి దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు కూకట్పల్లి(Kukatpally) పరిధిలో తరుచూ జరుగుతూనే ఉన్నాయి.