Hyderabad: అనుమానాస్పదస్థితిలో గృహిణి మృతి
ABN , Publish Date - Dec 03 , 2024 | 09:41 AM
అనుమానాస్పదస్థితిలో గృహిణి మృతి చెందింది. అల్వాల్ ఎస్‌ఐ సురేష్(Alwal SI Suresh) తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిసా రాష్ట్రం, బరంపూర్ ప్రాంతానికి చెందిన ఘనే కీర్తి(23)కి అదే ప్రాంతానికి చెందిన సామ్రాట్(25)తో 2022 నవంబర్‌లో వివాహం జరిగింది. సామ్రాట్ నగరంలోని హైటెక్ సిటీ(Hi-tech City)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
హైదరాబాద్: అనుమానాస్పదస్థితిలో గృహిణి మృతి చెందింది. అల్వాల్ ఎస్‌ఐ సురేష్(Alwal SI Suresh) తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిసా రాష్ట్రం, బరంపూర్ ప్రాంతానికి చెందిన ఘనే కీర్తి(23)కి అదే ప్రాంతానికి చెందిన సామ్రాట్(25)తో 2022 నవంబర్‌లో వివాహం జరిగింది. సామ్రాట్ నగరంలోని హైటెక్ సిటీ(Hi-tech City)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కీర్తి, తల్లిదండ్రులతో కలిసి అల్వాల్ భూదేవినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భార్య కీర్తి ఇంట్లో ఉరేసుకుని మృతిచెందనదని భర్త సామ్రాట్ ఒడిసా(Odisha)లో ఉంటున్న కీర్తి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..
సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వారు కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెది ఆత్మహత్య కాదని పేర్కొన్నారు. కీర్తి మృతికి భర్త సామ్రాట్, అత్తమామలు, అడపడుచే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరగగానే భర్తనే కీర్తిని తొలుత యశోద ఆస్పత్రికి అక్కడి నుంచి గాంధీకి తరలించినట్లు తెలుస్తుంది. కీర్తి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News