Cyber criminals: మనీ లాండరింగ్ కేసుల పేరుతో రూ.2.95 లక్షలు కొట్టేశారుగా..
ABN , Publish Date - Nov 30 , 2024 | 08:04 AM
మీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు తరలిందని, మీపై మనీ లాండరింగ్(Money laundering) కేసులు నమోదయ్యాయని బెదిరించిన సైబర్ నేగరాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.95 లక్షలు కాజేశారు.
హైదరాబాద్ సిటీ: మీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా విదేశాలకు డబ్బు తరలిందని, మీపై మనీ లాండరింగ్(Money laundering) కేసులు నమోదయ్యాయని బెదిరించిన సైబర్ నేగరాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.2.95 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి (32)కి ముంబై క్రైం బ్రాంచ్ పేరుతో సైబర్ నేరగాడు వీడియో కాల్(Video call) చేశాడు. మీ పేరుతో ముంబై కుర్లా, బాంద్రా బ్యాంకులతోపాటు దేశ వ్యాప్తంగా 20 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, వాటి ద్వారా హవాలా డబ్బు తరలిందని చెప్పాడు. దీనికి సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని చెప్పాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా అరెస్ట్ చేస్తామని బెదిరించాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో డ్రోన్‌తో స్ప్రే..
ఈ విషయం ఎవరికైనా చెబితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. మీకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవడానికి మీ ఖాతాలో ఉన్న డబ్బు మేము సూచించిన ఖాతాలకు పంపాలని చెప్పాడు. మీ ఖాతాలో ఉన్న డబ్బు మనీలాండరింగ్ నుంచి సంపాదించింది కాకపోతే 15 నిమిషాల్లో మీ ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పాడు. దాంతో భయపడిన బాధితుడు తన వద్ద ఉన్న రూ.2,95,300 వారు సూచించిన ఖాతాలకు పంపాడు. తర్వాత డబ్బు తిరిగి రాకపోడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News