Hyderabad: ఒడిశా టూ హైదరాబాద్.. డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిపోయారు..
ABN , Publish Date - Dec 01 , 2024 | 11:52 AM
ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట పోలీసులతో కలిసి సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు.
- ఒడిశా నుంచి నగరానికి ఆమ్‌ఫెటమైన్ డ్రగ్
- రూ.20లక్షల సరుకు స్వాధీనం
- దంపతులు సహా 13మంది అరెస్ట్
హైదరాబాద్ సిటీ: ఒడిశా నుంచి నగరానికి వచ్చి ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న దంపతులను బేగంపేట(Begumpet) పోలీసులతో కలిసి సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన మరో 11 మంది వినియోగదారులనూ అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన అతిఫ్ అస్లాం ఖాన్, సుభానీ బేగం దంపతులు ఒడిశా నుంచి నగరానికి వచ్చి ప్రకాష్ నగర్‌లో ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నారు. వారు ఒడిశా నుంచి తెచ్చిన 300 గ్రాముల ఆమ్‌ఫెటమైన్ డ్రగ్‌ను చిన్న మోతాదుల్లో ప్యాకింగ్ చేశారు.
ఆ వార్తను కూడా చదవండి: JNTU: రెగ్యులర్ వీసీనా.. మళ్లీ ఇన్‌చార్జేనా..
అప్పటికే నగరంలోని ఉన్న కస్టమర్స్‌ను సంప్రదించి డ్రగ్‌ను విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జంగయ్య(West Zone Task Force Inspector Jangaiah) టీమ్ నిఘా పెట్టి బేగంపేట పోలీసులతో కలిసి అతిఫ్ అస్లాం దంపతులను అరెస్టు చేశారు. వారిని విచారించిన క్రమంలో 11మంది వినియోగదారులు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 250 గ్రాముల డ్రగ్‌ను, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ రూ.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
ఈవార్తను కూడా చదవండి: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్
ఈవార్తను కూడా చదవండి: ఏడాదిలోనే ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచాం
Read Latest Telangana News and National News