Cyber criminals: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. పార్ట్‌టైం జాబ్ పేరుతో..
ABN , Publish Date - Dec 03 , 2024 | 10:28 AM
పార్ట్‌టైం జాబ్ అంటూ నగరవాసిని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) పలు దఫాలుగా పెట్టుబడి పెట్టించి రూ.1.65 లక్షలు కాజేశారు. పార్ట్‌టైం ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతికిన నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి (44)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు.
- నగరవాసి నుంచి రూ.1.65 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: పార్ట్‌టైం జాబ్ అంటూ నగరవాసిని మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) పలు దఫాలుగా పెట్టుబడి పెట్టించి రూ.1.65 లక్షలు కాజేశారు. పార్ట్‌టైం ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతికిన నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి (44)ని సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. తాము మైండ్ డిజిటల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులమని చెప్పుకున్నారు. టాస్క్‌ల పేరుతో గూగుల్ మ్యాప్స్(Google Maps)లో రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు
నమ్మకం సాధించేందుకు ఒక్కో టాస్క్ పూర్తి చేస్తే రూ. 150 చొప్పున ఇచ్చారు. తర్వాత వీఐపీ టెలీగ్రాం గ్రూపులో చేర్చారు. అధిక సంపాదన కోసం రూ. 2 వేలు పెట్టుబడి పెట్టి టాస్క్‌లు పూర్తి చేసే రూ.2800, అలాగే రూ.5 వేలు పెట్టుబడి పెట్టి టాస్క్‌లు పూర్తిచేస్తే రూ.6500, రూ.33 వేలు పెట్టుబడి పెట్టి టాస్క్‌లు పూర్తి చేస్తే రూ.49,500 ఇస్తామని చెప్పారు. దాంతో అధిక ఆదాయం కోసం రూ.33 వేలు సైబర్ నేరగాళ్లకు చెల్లించాడు.
పూర్తి చేసిన టాస్క్‌ల్లో తప్పులు ఉన్నాయని, డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఈ డబ్బు రావాలంటే మరింత పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇలా పలుమార్లు బాధితుడి నుంచి రూ.1.65 లక్షలు వసూలు చేశారు. ఎన్ని సార్లు డబ్బులు పెట్టినా మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News