Home » Crime
తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం కృష్ణగిరి జిల్లా డెంకణీకోట పరిధిలోని బి.శెట్టిపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. కెలమంగలం పోలీసులు(Kelamangalam Police) తెలిపిన వివరాల మేరకు డెంకణీకోట సమీపంలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాహనాల విడిభాగాలను తయారు చేస్తారు.
నగర సందర్శనకు వచ్చిన మహారాష్ట్ర(Maharashtra) యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్(LB Nagar Police Station) పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్హెచ్ఓ వినోద్‌కుమార్ తెలిపిన ప్రకారం... మధ్యప్రదేశ్ బాలాఘాట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన రోహిత్‌కుమార్ పట్లే(30) మీర్‌పేట బడంగ్పేట్ అన్నపూర్ణ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
జగద్గిరిగుట్ట రింగ్‌బస్తీ(Jagadgirigutta Ringbasti)లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణ నిర్వాహకుడిని బాలానగర్ ఎస్ఓటీ, జగద్గిరిగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. బీహార్(Bihar)కు చెందిన సునీల్‌కుమార్ ఝూ 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు.
పూటకో వేషం.. రోజుకో మోసంతో మ్యాట్రిమోనీ(Matrimony)లో అమ్మాయిలను మోసం చేసి రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న మోసగాడిపై రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన వంశీకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల సూచనతో ఎవరికి వారుగా పెళ్లి చేసుకున్నారు. అయినా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం వారి కుటుంబాలలో తెలియడంతో భయపడి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా సృష్టి (20), ప్రసన్న (25) ప్రేమించుకున్నారు.
తన భర్త తీసుకున్న డబ్బుల విషయంలో తనను మానసికంగా వేధించడంతో పాటు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినా స్వీకరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాల దాసరి రమ్య(Dasari Ramya) రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు.
శబరిమల(Shabari mala) దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రనగర్(Rajendranagar)కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్రమైనగాయాలు కాగా మరొకరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు టీచర్లు గాడి తప్పుతున్నారు. తరగతి గదులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పాఠశాలలకు తాళాలు వేసి పార్టీ కొందరు టీచర్లు పార్టీ చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఒడిశా నుంచి సికింద్రాబాద్(Odisha to Secunderabad) మీదుగా రైలులో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి జైలుకు వెళ్లారు. అక్కడ కలిసిన ఐదుగురు నిందితులతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ అదేబాట పట్టారు. న్యూ ఇయర్ వేడుకలకు గంజాయిని నగరంలో విక్రయించేందుకు తీసుకువస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. 35 కేజీల గంజాయితోపాటు కారు, బైకు, ఐదు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.