Share News

Bengaluru: వివాహేతర సంబంధం.. చివరికి ఆత్మహత్యకు దారితీసింది..

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:24 PM

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల సూచనతో ఎవరికి వారుగా పెళ్లి చేసుకున్నారు. అయినా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం వారి కుటుంబాలలో తెలియడంతో భయపడి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా సృష్టి (20), ప్రసన్న (25) ప్రేమించుకున్నారు.

Bengaluru: వివాహేతర సంబంధం.. చివరికి ఆత్మహత్యకు దారితీసింది..

- మండ్య జిల్లా మద్దూరు తాలూకాలో ఘటన

బెంగళూరు: ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల సూచనతో ఎవరికి వారుగా పెళ్లి చేసుకున్నారు. అయినా వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం వారి కుటుంబాలలో తెలియడంతో భయపడి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా సృష్టి (20), ప్రసన్న (25) ప్రేమించుకున్నారు. ప్రసన్న చివరకు సృష్టి స్నేహితురాలు స్పందనను పెళ్లి చేసుకున్నాడు. కె.బెళ్ళూరు గ్రామానికి చెందిన సృష్టికి ఆతగూరు హోబళి యరగనహళ్ళి(Hobali Yaraganahalli)కి చెందిన దినేశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది.

ఈ వార్తను కూడా చదవండి: Mumbai Boat Accident : ముంబై సముద్రతీరంలో పడవ ప్రమాదం


భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలతో నాలుగైదుసార్లు తీవ్ర గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సృష్టి, బన్నహళ్ళికి చెందిన ప్రసన్నతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం ఇరు కుటుంబాల వారికి తెలియడంతో భయపడ్డారు. ఈ నేపథ్యంలో సృష్టి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కనిపించడం లేదంటూ భర్త దినేశ్‌ స్థానిక కెస్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి శింషా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతదేహం మద్దూరు తాలూకాలోని వైద్యనాథపుర గ్రామ శివారులో కుళ్లిన స్థితిలో సోమవారం సాయంత్రం లభించింది.

pandu2.2.jpg


సృష్టి మృతిచెందిందనే సమాచారం తెలుసుకున్న ప్రసన్న భయపడి బన్నహళ్ళిలోని తన ఇంట్లో ఉరేసుకుని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్దూరు పోలీసులు ఇరువురి కుటుంబీకుల ఫిర్యాదులు స్వీకరించి, దర్యాప్తు చేపట్టారు. సృష్టి మృతదేహానికి మండ్య జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మద్దూరు ఆసుపతిల్రో ప్రసన్న మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.


ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన

ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు

ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 19 , 2024 | 01:24 PM