Home » Devotional
నేడు (16-08-2024 - శుక్రవారం) చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు...
శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వ్రతాలు, నోములు, పూజలు.. ముఖ్యంగా శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం. సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఈ మాసంలో ఆచరించే వాటిలో వరలక్ష్మీ వ్రతం ప్రధానమైనది.
ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ శుక్రవారం. ఆ రోజు మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. మరి ఆ రోజు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు మహిళలు ఏం చేయాలి. ఏం చేయకూడదు. ఏ రంగు చీరలు ధరించాలి. ఏ రంగు చీరలు ధరించ కూడదనే విషయాన్ని జోతిష్య పండితులు సోదాహరణగా వివరిస్తున్నారు.
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది.
శ్రావణ మాసం ధనుర్మాసంలో భాగం. ధనుర్మాసం మహావిష్ణువుకు ఎంతో ప్రీతి. ఇక మహావిష్ణువు సతిగా, అష్టైశ్వార్యాలు ప్రసాదించే కల్పవల్లిగా ఆ మహాలక్ష్మిని వర మహాలక్ష్మిగా పూజిస్తారు.
పూర్యకాలంలో ఈ వ్రతాన్ని చారుమతి ఆచరించింది. తన భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, తోటివారికి అండగా ఉంటూ మంచి ప్రవర్తన కలది చారుమతి. ఆమె కలలో శ్రీమహాలక్ష్మి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియచేసింది.
శ్రావణ మాసంలో మహిళలు పూజలు, వ్రతాలు, నోములు అధికంగా ఆచరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రావణమాసంలో రెండో శుక్రవారం.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు జరుపుకుంటారు. ఈ ఏడాది రెండో శుక్రవారం.. ఆగస్ట్ 16వ తేదీ వచ్చింది.
నేడు (14-08-2024-బుధవారం)మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
నేడు (10-08-2024- శనివారం ) అనుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
Vastu Shastra Rules: ఎంత పెద్ద కోటీశ్వరులైనా... కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించినా.. ఆ నిర్మాణానికి ముందు వాస్తును తప్పకుండా పాటిస్తారు. ఇంటి నిర్మాణం, డిజైన్ విషయంలో వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటారు. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు.