Share News

Sravana Masam : శ్రావణ మాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే..!

ABN , Publish Date - Aug 15 , 2024 | 01:59 PM

పూర్యకాలంలో ఈ వ్రతాన్ని చారుమతి ఆచరించింది. తన భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, తోటివారికి అండగా ఉంటూ మంచి ప్రవర్తన కలది చారుమతి. ఆమె కలలో శ్రీమహాలక్ష్మి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియచేసింది.

Sravana Masam : శ్రావణ మాసంలో ప్రతి రోజూ ప్రత్యేకమే..!
Sravana masam

తెలుగు మాసాల్లో ప్రతి మాసానికీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఆడవారంతా పూజించే వరలక్ష్మీదేవికి సంబంధించి శ్రావణమాసం మరింత ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారాన్ని మరింత శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆరోజున అమ్మవారిని అందంగా అలంకరించి శ్రావణ లక్ష్మిని తమ సౌభాగ్యాన్ని చల్లగా కాపాడమని కోరుకుంటారు. ఈ నెలలో సోమవారాలు, మంగళ వారాలు, శుక్రవారాలలో పూజలు, నోములు, వ్రతాలు ప్రత్యేకంగా జరుపుతారు.

శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. రెండో శుక్రవారంలో వరలక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరిస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారిని కలశంతో పూజిస్తారు. రక రకాల పిండివంటలతో పాటు పండ్లను, పూలను ఉంచి అమ్మను కొలుస్తారు. క్యార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత ఇవన్నీ వరలక్ష్మీ దేవి అందివ్వాలని మనసారా ప్రార్థిస్తారు. వ్రతం ముగిసిన తరువాత సాయంత్రాలు ముత్తయిదువులకు వాయినాలు ఇస్తారు.

ఈ వ్రతం అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రావణ మంగళవారాల్లో గౌరీ దేవిని పూజిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని విశ్వాసం. ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపతికి వివరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలు తమ మాంగళ్యాన్ని కాపాడమని మంగళ గౌరిని పూజిస్తారు. మత్తైదువు వాయినం ఇస్తారు. ఇదే పూజను కొన్ని ప్రాంతాల్లో పెళ్ళి కాని ఆడవారు కూడా ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి భర్త వస్తాడనేది నమ్మకం.

పూర్యకాలంలో ఈ వ్రతాన్ని చారుమతి ఆచరించింది. తన భర్తను దైవంగా భావిస్తూ, అత్తమామలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, తోటివారికి అండగా ఉంటూ మంచి ప్రవర్తన కలది చారుమతి. ఆమె కలలో శ్రీమహాలక్ష్మి కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం తనను పూజించాలని చెబుతూ, వ్రత విధి విధానాలను తెలియచేసింది.

Skin Care : చర్మం పొడిబారుతుంటే దానికి కారణాలు, నివారణలు ఇవిగో...!

తెల్లవారుతూనే ఈ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు తెలిపించి చారుమతి. తోటి మహిళలతో కలిసి సంతోషంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించింది. అన్ని వర్ణాల స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించి, వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది.

శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఆరోజును అదీ శ్రావణమాసంలో అమ్మవారిని పూజించడం ఐశ్వర్యానికి, ప్రేమ, దాంపత్యం, అందం ఇలా సకల శుభాలను కలిగిస్తుందని నమ్మకం. ఆరోజున అమ్మవారిని పూజిస్తే గ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుందని నమ్ముతారు. శ్రీమహా విష్ణువు జన్మనక్షత్రం శ్రవణం. మహాలక్ష్మి, విష్ణువు అంత అన్యోన్యతతో అందరి దాంపత్యం ఉంటుందనే మరో నమ్మకం కూడా ఉంది.

Updated Date - Aug 15 , 2024 | 02:00 PM