Home » Elections » Lok Sabha
తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ అతిథితో వీక్షకుల ముందుకొచ్చింది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశిష్ఠ అతిథిగా విచ్చేశారు.
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగమైన మూడో దశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. గడువు సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ అధికారులు ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 5 గంటల సమయానికి మూడో దశ పోలింగ్ 60.19 శాతంగా నమోదయిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ప్రజాదరణ కలిగిన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమం మరో విశిష్ఠ రాజకీయ నేతతో డిబేట్‌కు సంసిద్ధమైంది. ఈ సారి ఏకంగా తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి్ని ముక్కుసూటి ప్రశ్నలు అడిగేందుకు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) సిద్ధమయ్యారు.
కడియం శ్రీహరి దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హిందువైతే భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) సవాల్ విసిరారు. 27 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా..? కాదా...? ప్రమాణం చేయాలి అని సవాల్ విసిరారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది రాజీవ్ గాంధీ అవునా కాదా..? ప్రమాణం చేయాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మం, మోదీపై అద్దంకి దయాకర్ అభ్యంతర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సీఈఓ వికాస్ రాజ్‌ను సోమవారం బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత (Madhavi latha) కలిసి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ (Congress) పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) అన్నారు. నర్సంపేటలో సోమవారం బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై పుష్కర్ సింగ్ దామి తీవ్ర విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.