Lok Sabha Elections 2024: రిజర్వేషన్లపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోంది: సీఎం పుష్కర్ సింగ్ ధామి
ABN , Publish Date - May 06 , 2024 | 06:58 PM
కాంగ్రెస్ (Congress) పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) అన్నారు. నర్సంపేటలో సోమవారం బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై పుష్కర్ సింగ్ దామి తీవ్ర విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
వరంగల్: కాంగ్రెస్ (Congress) పార్టీని దేశ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) అన్నారు. నర్సంపేటలో సోమవారం బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై పుష్కర్ సింగ్ దామి తీవ్ర విమర్శలు గుప్పించారు. మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపును బీజేపీ (BJP) తెచ్చిందని వివరించారు.
TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు
సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసునని ఆదివాసీ, గిరిజన ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతోందని ఉద్ఘాటించారు. దేశాన్ని డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటి పడేలా నిలిపారని చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లపై, బీజేపీపై కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ, 6 గ్యారెంటీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. మోసపూరిత హమీలు ిచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కోరారు.
ఇవి కూడా చదవండి
Lok Sabha Polls:మూడో విడతలో ప్రముఖులు.. అమిత్ షా గట్టెక్కుతారా..!
Telangana: రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలో నిధులు..
Read Latest Telangana News And Telugu News