Share News

Lok Sabha Elections 2024: జిల్లాలు తీసేయడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్: హరీష్‌రావు

ABN , Publish Date - May 06 , 2024 | 09:57 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Lok Sabha Elections 2024: జిల్లాలు తీసేయడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్: హరీష్‌రావు
Harish Rao

మెదక్ జిల్లా: లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్, బీజేపీకి మెదక్ ప్రజలు గుణపాఠం చెబుతారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు పాలించిన బీజేపీ దేశానికి ఏమి చేసిందో చెప్పట్లేదన్నారు. 5 నెలలు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేశారో ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు.


TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయని చెప్పారని.. ఎక్కడ అమలవుతున్నాయో చెప్పాలని సవాల్ విసిరారు. ఏ గ్రామాల్లో 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయో... అక్కడే కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలని.. కానీ అమలు కాని చోట బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు.100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన తప్పుడు హామీకి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.100 రోజుల్లో హామీ చేస్తానన్న బాండ్ పేపర్లు బోన్స్ అయ్యాయని ఆరోపించారు.


Lok Sabha Polls:మూడో విడతలో ప్రముఖులు.. అమిత్‌ షా గట్టెక్కుతారా..!

మెదక్ జిల్లా ముద్దుబిడ్డ కేసీఆర్ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారని.. రాష్ట్రమంతా ఉద్యమం చేపట్టారని తెలిపారు. మోదీ పదేళ్ల పాలనలో అదానీ, అంబానీలకు మేలు చేశారు తప్ప పేదవాడికి ఏం చేయలేదని విరుచుకుపడ్డారు. మెదక్ సంగారెడ్డి సిద్దిపేటలను జిల్లాలుగా ఏర్పాటు చేసి కేసీఆర్ అభివృద్ధి చేశారని ఉద్ఘాటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే అవుతుందని చెప్పారు. ఉన్న జిల్లాలను పోగొట్టడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఫైర్ అయ్యారు.


మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన రావు జిమ్మిక్కులు, ఫేక్ వీడియోలతో ప్రచారం చేయబోతున్నారని ఆరోపించారు. ఫేక్ వీడియోలు, సోషల్ మీడియాలో బోగస్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. తప్పుడు వార్తలపై భోగస్ సోషల్ మీడియా ప్రచారాలపై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని అన్నారు. నిజాలను గ్రహించి మెదక్ ప్రజలు ఓటు వేయాలని హరీశ్‌రావు కోరారు.


Telangana: రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలో నిధులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 11:15 PM