Home » 2024 Lok Sabha Elections
తెలంగాణలో మే 13వ తేదీ జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎలాంటి రోల్ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వేళ తనని ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కలిశారని కుండబద్దలు కొట్టారు. తాను తలచుకొని ఉండుంటే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది. లోక్ సభ సీట్లు ఎక్కువ గెలవాలని టార్గెట్ విధించుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. రేపు మరోసారి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఎన్టీఏ కూటమి విజయవాడలో బుధవారం రోడ్ షో నిర్వహించనుంది.
కడియం శ్రీహరి దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు.
సోషల్ మీడియాలో ప్రముఖుల మీమ్స్ సందడి చేస్తుంటాయి. కొందరు క్రియేటర్స్ మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుంటారు. మీమ్స్ చూసి కొందరు లైట్ తీసుకుంటారు. మరికొందరు సీరియస్‌గా తీసుకొని, కేసులు పెడతారు.
దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
జార్ఖండ్‌లోని ఓ హౌస్ కీపర్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్వహించిన సోదాల్లో.. లెక్కల్లో చూపని రూ.25 కోట్ల నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తనతో పాటు తన ప్రభుత్వం..
ఓవైపు దేశ రాజకీయాల్లో ‘మత ప్రాతిపదికన రిజర్వేషన్ల’ అంశంపై వివాదం కొనసాగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సంచలన ప్రకటన చేశారు. తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సీపీఐ ముఖ్యనేత నారాయణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడంతో వెనక ఉద్దేశం అదేనని వివరించారు. రూ.వంద కోట్ల స్కామ్ ఆరోపణలు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. రూ.2 వేల కోట్ల స్కామ్ ఆరోపణలు ఉన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు.
ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు, ధృవపత్రం పరిశీలిస్తారు. అయినప్పటికి కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతాయి. ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లో సెక్షన్ 49(పి)లో పేర్కొంది. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు.