Loksabha Polls: ప్చ్.. అమేథిలో రాహుల్ పోటీ చేసి ఉంటే భలే సరదాగా ఉండేది..!!
ABN , Publish Date - May 04 , 2024 | 12:52 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను రవి కిషన్ ఖండించారు.
గోరఖ్ పూర్ నుంచి తాను మరోసారి విజయం సాధిస్తానని రవికిషన్ ధీమా వ్యక్తం చేశారు. తన పదవి కాలంలో చేపట్టిన పనులే విజయం సాధించేలా చేస్తాయని వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్ సభ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఇక్కడ ఎం-వై ఫ్యాక్టర్ కచ్చితంగా పనిచేస్తుందని వివరించారు. ఎం అంటే మోదీ, వై అంటే యోగి ఆదిత్యనాథ్ అని తెలిపారు. మోదీకి ముస్లింలు, యోగికి యాదవులు అండగా ఉంటారని, మెజార్టీ సీట్లను గెలుచుకుంటామని అంటున్నారు.
For Latest News and National News click here