Loksabha Polls: మీ ఓటు మరొకరు వేశారా..? ఇలా చేయండి..!!
ABN , Publish Date - May 06 , 2024 | 01:21 PM
ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు, ధృవపత్రం పరిశీలిస్తారు. అయినప్పటికి కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతాయి. ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లో సెక్షన్ 49(పి)లో పేర్కొంది. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది.
మీ ఓటును (Vote) మరొకరు వేస్తే మీరు ఎలా ఓటు వేయాలి..? ఆ దొంగ ఓటును కూడా ఓటుగా పరిగణిస్తారా..? ఓటరు మళ్లీ ఓటు వేసేందుకు అవకాశం ఉందా..? ఈ అంశంపై ఎన్నికల సంఘం ఏం చెబుతోంది. ఎన్నికల చట్టంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు, ధృవపత్రం పరిశీలిస్తారు. అయినప్పటికి కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతాయి. ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లో సెక్షన్ 49(పి)లో పేర్కొంది. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది. మీ ఓటును మరొకరు వేస్తే వెంటనే పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారిని కలువాలి. ఆ ఓటరు నిజమైన వ్యక్తో కాదో కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాటికి సరైన సమాధానం చెప్పగలిగితే మీరు ఓటు వేయచ్చు. ఆ సమయంలో మీ వెంట ఓటరు గుర్తింపు కార్డు, పోలింగ్ బూత్ స్లిప్ చూపించాలి. ఓటరు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందితే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
బ్యాలెట్ ద్వారా మాత్రమే ఓటు..?
ప్రిసైడింగ్ అధికారి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చిన వెంటనే బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలి. ఈవీఎంలలో ఓటు వేసే అవకాశం లేదు. ఆ ఓటును టెండర్ ఓటు అని పిలుస్తారు. బ్యాలెట్ మీద తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు వేసినప్పటికి ఆ ఓటును లెక్కించరు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓటు వచ్చిన పరిగణలోకి తీసుకోరు. టాస్ వేసి విజేతను ప్రకటిస్తారు. టాస్ ఓడిన వ్యక్తి కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. టెండర్ ఓటు గురించి అప్పీల్ చేసుకునే వీలు ఉంది. ఆ సమయంలో టెండర్ ఓటు సాయంతో దొంగ ఓట్లను తొలగిస్తారు. దొంగ ఓట్ల తొలగింపు ప్రక్రియతో అభ్యర్థులకు వచ్చిన కచ్చిత ఓట్ల సంఖ్య తెలుస్తోంది.
అప్పుడే కౌంటింగ్..?
దొంగ ఓటు పోలయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారిని కలిసి నిజమైన ఓటరు, ఓటు వేయాల్సి ఉంటుంది. అది ఓటరు సంతృప్తి కోసం ఇస్తారు. ఆ ఓటును భద్రపరుస్తారు. అభ్యర్థులకు సమానంగా ఓటు వచ్చినప్పటికి, ఒకరు టాస్ ద్వారా గెలుస్తారు. మరొకరు కోర్టుకు వెళ్లితేనే టెండర్ ఓటు లెక్కించే అవకాశం ఉంటుంది. మరొసారి రీ కౌంటింగ్ జరపడంతో పోలయిన నిజమైన ఓట్ల సంఖ్య తెలియనుంది.
Read Latest Andhra pradesh News or Telugu News