Home » aap party
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ నేతలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆదివారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిల్లా, మంత్రులు అతిశ్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్‌తోపాటు ఆ పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు.
దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను గోవా కోర్టు తిరస్కరించింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఈ కేసు నమోదైంది.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో చిక్కుకుని జైలు శిక్ష అనుభవిస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆప్ ( AAP ) పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ పార్టీ నాయకురాలు, మంత్రి అతిశీకి ఎన్నికల సంఘం నోటీసు పంపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి బయటకు రాగానే అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియాలను ఆయన కలిశారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను ఈడీ అరెస్టు చేసింది. దీనిని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యాన్ని విచారించిన అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Scam ) కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇవాళ జైలు నుంచి బయటకు రానున్నారు. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ సింగ్‌కు రూస్ అవెన్యూ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ ఎన్నికల సమయంలో మరికొందరిని అరెస్టు చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) నూ అరెస్టు చేసింది. కస్టడీ కోసం తీహార్ జైలుకూ తరలించింది.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఆప్ నేత అతిశీ కీలక ప్రకటన చేశారు. దిల్లీ మద్యం కేసులో తమ నాయకుడు కేజ్రీవాల్ ( Kejriwal ) ను అన్యాయంగా ఈడీ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా తాము హోలీ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత తాజాగా ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ కుటుంబంలోని ఎవరినీ తనను కలవడానికి అనుమతించడం లేదని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దీంతోపాటు మరికొంత మంది ఆప్ నేతలు కూడా స్పందించారు.