Delhi Coaching Centres: రావూస్ ఘటన తర్వాత.. 13 కోచింగ్ సెంటర్లకు సీల్!!
ABN , Publish Date - Jul 29 , 2024 | 08:00 AM
విరుద్ధంగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులు అంతా ప్రిపేర్ అవుతున్నారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చింది. దాంతో చాలా మంది విద్యార్థులు పైకి వచ్చారు. తానియా సోని, శ్రేయ యాదవ్, నెవిన్ డాల్విన్ మాత్రం వరదనీటిలో చిక్కుకొని చనిపోయారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఢిల్లీ: రావూస్ కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం ముగ్గురు విద్యార్థులను బలి తీసుకుంది. ఆ తర్వాత కళ్లు తెరిచిన అధికారులు మిగతా కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. పాత రాజిందర్ నగర్ వద్ద కోచింగ్ సెంటర్లను ఆదివారం పరిశీలించారు. 13 కోచింగ్ సెంటర్లు (13 Coaching Centres) సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని నిర్ధారించారు. ఆ కోచింగ్ సెంటర్లకు సీల్ వేశారు.
నిబంధనలు బేఖాతరు
రావూస్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా లైబ్రరీ ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థులు అంతా ప్రిపేర్ అవుతున్నారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చింది. దాంతో చాలా మంది విద్యార్థులు పైకి వచ్చారు. తానియా సోని, శ్రేయ యాదవ్, నెవిన్ డాల్విన్ మాత్రం వరదనీటిలో చిక్కుకున్నారు. ఆ నీటిలోనే జల సమాధి అయ్యారు. నిజానికి బేస్ మెంట్ ప్రాంతంలో పార్కింగ్, స్టోర్ రూమ్ నిర్మిస్తామని రావూస్ కోచింగ్ సెంటర్ చెప్పింది. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆ ప్రాంతంలో విద్యార్థుల కోసం లైబ్రరీ నిర్మించింది. ఆ విధంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడింది.
13 కోచింగ్ సెంటర్లు
రావూస్ ఘటనతో ఢిల్లీ మున్సిపల్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ‘రాజిందర్ నగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్లను పరిశీలించారు. బేస్ మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవవహరించే కోచింగ్ సెంటర్లను గుర్తించారు. అలా పరిశీలించగా 13 వెలుగు చూశాయి. ఆ కోచింగ్ సెంటర్లకు సీల్ వేశారు. ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతాయి. రావూస్ ఐఏఎస్ అకాడమీ అనుమతి అంశంపై విచారణ జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకుంటాం. అధికారుల పాత్ర రుజువైతే కఠిన చర్యలు తప్పవు. ఏ ఒక్క అధికారిని వదలం అని’ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తేల్చి చెప్పారు.
మేయర్ ఇంటి ముట్టడి
రావూస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విద్యార్థి సంఘాలు మేయర్ ఒబెరాయ్ ఇంటిని చుట్టుముట్టారు. విద్యార్థుల మృతికి మేయర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రావూస్ ఘటనపై ఇంటా బయట విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో మిగతా కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టాలని మేయర్ ఒబెరాయ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తనిఖీలు చేపట్టగా 13 కోచింగ్ సెంటర్లు సరయిన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది.
Valmiki Scam: సీఎం బాధ్యతారాహిత్యంపై మండిపడిన నిర్మలా సీతారామన్
సీజ్ చేసిన కోచింగ్ సెంటర్లు ఇవే..
ఐఏఎస్ గురుకుల్
చాహల్ అకాడమీ
ప్లటస్ అకాడమీ
సాయి ట్రేడింగ్
ఐఏఎస్ సేతు
టాపర్స్ అకాడమీ
దైనిక్ సంవాద్
సివిల్ డైలీ ఐఏఎస్
కెరీర్ పవర్
99 నోట్స్
విద్య గురు
గైడెన్స్ ఐఏఎస్
ఈజీ ఫర్ ఐఏఎస్
Read More National News and Latest Telugu News