Home » AAP
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..
దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఇస్తారా అని ప్రధాని మోదీకి ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
కొందరు నాయకులైతే ప్రాణం పోయే వరకు ఒకే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లు. ఇదంతా గతం.. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. పదవుల కోసం పార్టీలు ఫిరాయించడం కామన్ అయిపోయింది. ఉదయం ఏ పార్టీలో ఉంటారో.. మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారో చెప్పడమే కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ..
క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో సోమవారంనాడు ఊరట లభించింది.
ఎంసీడిలో ఖాళీగా ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుని ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎలాంటి పోటీ లేకుండా గెలుపొందారు. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు.
శుక్రవారం ఎన్నికల పోలింగ్‌కు గంట ముందు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎంసీడీ కమిషనర్ అశ్విని కుమార్‌కు లేఖ రాశారు. ముందస్తు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 5వ తేదీకి ఎన్నికలు వాయిదా వేయాలని ఆ లేఖలో సూచించారు. ఎన్నికల తేదీని రివైస్ చేసి స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించడం వల్ల లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఎంసీడీ సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశంలో ఒక స్టాండింగ్ కమిటీ సభ్యుడిని ఎన్నుకుంటారు. కమల్జీత్ షరావత్ ఇటీవల ఎంపీగా ఎన్నికకావడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుడి సీటుకు ఖాళీ ఏర్పడింది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను ఈరోజు బాధ్యతలు చేపట్టానని, 14 ఏళ్ల పాటు రాముడు అరణ్యవాసం చేసిన సమయంలో అయోధ్య పాలన సాగించినప్పుడు భరతుడి మనోగతం ఎలాగ ఉందో తాను కూడా అలాంటి ఫీలింగ్‌తోనే ఉన్నట్టు అతిషి చెప్పారు.
న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొన్ని గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సైతం తన కేబినెట్‌ను పునర్ వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టారు.