Sonia Mann Joins AAP: ఆప్‌లో చేరిన నటి సోనియా మాన్
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:48 PM
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.

చండీగఢ్: పంజాబీ నటి (Punjabi Actress), కీర్తి కిసాన్ యూనియన్ నేత బల్‌దేవ్ సింగ్ కుమార్తె సోనియా మాన్ (Sonia Mann) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో చేరారు. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఆదివారంనాడు ఆమె ఆప్‌లో చేరారు. ఆమెను కేజ్రీవాల్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినట్టు ఆప్ పంజాబ్ విభాగం ఒక ట్వీట్‌లో తెలిపింది.
Atishi: ఆప్ విపక్ష నేతగా అతిషి.. ఈ పదవికి తొలి మహిళగా రికార్డు
ఎవరీ సోనియా మాన్..?
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు. 2020లో 'హ్యాపీ హార్డీ అండ్ హీర్'లో నటించారు. నటిగానే కాకుండా గాయనిగా కూడా ఆమె దివంగత పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాతో 2018లో పనిచేశారు. ఆమె తండ్రి బల్‌దేవ్ సింగ్ రైతు నాయకుడు, యాక్టివిస్ట్‌గా పనిచేశారు. 1980లో ఆయనను ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమార్చారు.
పంజాబ్‌పై కేజ్రీవాల్ దృష్టి
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్' అధికారం కోల్పోవడంతో ఆప్ 'పంజాబ్' యూనిట్‌పై ప్రస్తుతం కేజ్రీవాల్ ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. 2027లో పంజాబ్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఈ రెండేళ్లలో పార్టీని అన్నివిధిలా పటిష్టం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓటమి చవిచూశారు. 13 ఏళ్ల పాటు హస్తినను పాలించిన ఆప్ అధికారం కోల్పోయింది.
ఇవి కూడా చదవండి...
Shashi Tharoor: కాంగ్రెస్‌తో విభేదాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Accident: కుంభమేళా యాత్రికులకు ప్రమాదం, ముగ్గురు మృతి.. అధికారుల సూచన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. మళ్లీ ఖాతాల్లో డబ్బులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.